రైల్వే ప్రయాణికుల(Indian Railways) సౌకర్యాలను మెరుగుపరచే దిశగా భారతీయ రైల్వే(IRCTC) కీలక మార్పులు తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో తీవ్ర ఆలస్యం ఏర్పడిన సందర్భాల్లో ప్రయాణికులకు ఆహారం, వసతి, రీఫండ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read also: Rain Alert: నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం రైలు రెండు గంటలకంటే ఎక్కువ ఆలస్యమైతే(Train Delay) ప్రయాణికులకు ఉచిత భోజనం లేదా అల్పాహారం అందిస్తారు. ఆలస్యం మూడుగంటలు దాటితే ప్రయాణికులు తమ టికెట్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యాలు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లకు వర్తించనున్నాయి.
ప్రయాణ సమయాన్ని బట్టి ఆహారం కూడా మారుతుంది. ఉదయ వేళ రైలు ఆలస్యమైతే టీ, కాఫీ, బిస్కెట్లు ఇస్తారు. మధ్యాహ్నం లేదా రాత్రి ఆలస్యం అయితే అన్నం, పప్పు, కూరతో కూడిన భోజనం అందించబడుతుంది. టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: