Iran War: హోర్ముజ్ జలసంధిలో 22 భారత నౌకలు

Read Time:  1 min
హోర్ముజ్ జలసంధిలో 22 భారత నౌకలు
హోర్ముజ్ జలసంధిలో 22 భారత నౌకలు
FONT SIZE
GET APP

ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ (Hormuz) జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఇండియాకు చమురు తీసుకొచ్చే 22 నౌకలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇండియావి, ఇంకొన్ని విదేశాలకు చెందినవి. కానీ, అన్నింటి గమ్యం ఇండియానే. ఇటీవల రెండు నౌకలు ఇండియా చేరుకోగా, మిగిలిన 22 నౌకల్ని కూడా ఇండియా తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అవసరమైతే నేవీని కూడా వాడాలని నిర్ణయించింది.

Read Also: Terrorist Attacks: భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Iran War: 22 Indian ships in the Strait of Hormuz
Iran War: 22 Indian ships in the Strait of Hormuz

ఇప్పట్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించకపోవడంతో నేరుగా ఇండియన్ నేవీయే రంగంలోకి దిగబోతుంది. భారత చమురు అవసరాలు తీరాలంటే హోర్ముజ్ జలసంధి వద్ద చిక్కుకున్న నౌకలు ఇండియాకు తిరిగి రావడం చాలా కీలకం. యుద్ధ సంక్షోభం కారణంగా ఆ నౌకల ప్రయాణం కష్టతరంగా మారింది. ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ నౌకల లొకేషన్‌లను ఇండియా గుర్తించింది. 22 నౌకల్లో 20 నౌకలు చమురు సరఫరాకు సంబంధించినవే. ఇవన్నీ కార్గో షిప్స్. వీటిలో భారీ స్థాయిలో చమురు నిల్వలున్నాయి. ఈ నౌకలన్నింటిలో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ, 3.21 లక్షల టన్నుల ఎల్పీజీ, 16.76 లక్షల క్రూడాయిల్ నిల్వలున్నాయి. ఇప్పుడు కేంద్రం వీటిని గుర్తించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.