📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran USA War: యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

Author Icon By Aanusha
Updated: March 18, 2026 • 12:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran USA War: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య క్షిపణి దాడులు తీవ్రం కావడంతో అంతర్జాతీయ విమానయాన రంగం సంక్షోభంలో పడింది. భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మార్చి 15, తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Congress Candidate List Kerala: కేరళ ఎన్నికల వేళ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!

ప్రయాణికులకు ఊరటనిచ్చే చర్యలు

యుద్ధం కారణంగా గగనతలం అస్థిరంగా మారడం, యూఏఈ ప్రభుత్వం విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. విమానాలు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి రిఫండ్ లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో ఉచితంగా టికెట్ మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Iran USA War: War effect.. Flights to Gulf countries banned

ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం తమ గగనతలం, విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించింది. క్షిపణుల ముప్పు పొంచి ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిమితం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air India Gulf Flights Flight Cancellations India to Dubai Indigo Flight Status Iran USA War News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.