Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్త దావానంలా వ్యాపించడంతో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ వార్త తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. తమ ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు
Read Also: Iran IRGC New Commander: ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. భారీ ర్యాలీ
శ్రీనగర్ వీధుల్లో అలీ ఖమేనీ చిత్రపటాలను, నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడులను, ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన నిరసనకారులు.. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కొన్ని చోట్ల టైర్లు తగులబెట్టి రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: