📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran Allows Indian ships: హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran Allows Indian ships: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం పశ్చిమ ఆసియాను కుదిపేస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ మధ్య, అంతర్జాతీయ నౌకాయానం దాదాపు స్తంభించిపోయింది.

Read Also: Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

భారత ట్యాంకర్లకు ప్రత్యేక అనుమతి

ఇంతటి యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్‌కు ఇరాన్ సానుకూల సంకేతాలు పంపింది. భారత జెండా ఉన్న కొన్ని చమురు ట్యాంకర్లకు తమ జలాల ద్వారా ప్రయాణించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల విదేశాంగ స్థాయిలో జరిగిన చర్చల తర్వాత భారత్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించేందుకు అనుమతి లభించింది అని వర్గాలు తెలిపాయి.

Iran Allows Indian ships

ఇదిలా ఉండగా, ఈ మార్గంలో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఇరాన్ సైన్యం అక్కడ సీ మైన్స్ (Sea Mines) మోహరించిందని సమాచారం. దీంతో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా, కొన్ని విదేశీ జెండా నౌకలపై దాడులు జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఒక థాయ్ జెండా నౌకపై దాడి జరగడంతో సముద్ర రవాణా భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన ఆయిల్ సరఫరాలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, నౌకలకు భద్రతా చర్యలు గురించి కూడా పరిశీలిస్తోంది. మొత్తానికి, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి పరిస్థితి ప్రపంచ చమురు సరఫరా మరియు భారత ఇంధన భద్రతపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India Iran Diplomacy Indian oil tankers Iran Allows Indian ships Iran Israel conflict Strait of Hormuz

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.