📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Iphone 17 : బాబోయ్ ఇండియాలో ఐఫోన్ సిరీస్ అంత రేట్ ఆ !

Author Icon By Sai Kiran
Updated: September 10, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iphone 17 : ఐఫోన్ అంటే క్రేజ్ వేరే లెవెల్. కొత్త మోడల్ రిలీజ్ అయితే మన దగ్గర లైన్లు పడతాయి, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియాలో ఐఫోన్ ధర దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ. తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం (Iphone 17) ప్రో (256GB) ఇండియాలో రూ.1,34,900. అదే ఫోన్ జపాన్‌లో రూ.91,200, ఫ్రాన్స్‌లో కేవలం రూ.89,000 మాత్రమే.

ఒకే ఐఫోన్ ధర దేశానికోలా ఎంత తేడా ఉంటుందో చూసి షాక్ అవుతారు. ఇండియాలో ధర రూ.1,34,900 అంటే వరల్డ్‌వైడ్‌లోనే అత్యధిక ధర. UAEలో రూ.1,27,306, అమెరికాలో రూ.1,24,417, యూకేలో రూ.1,15,395, చైనాలో రూ.1,12,849, ఆస్ట్రేలియాలో రూ.1,07,946, జర్మనీలో రూ.97,811, కెనడాలో రూ.97,539. కానీ జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మాత్రం ధరలు చాల తక్కువ. అంటే మన దగ్గర ఒక ఐఫోన్ కొంటే అక్కడ రెండు ఫోన్లు కొనేసే అవకాశం ఉంటుంది.

ఇండియాలో ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇంపోర్ట్ టారిఫ్స్ మరియు GST. యాపిల్ ఇండియాలో అసెంబ్లింగ్, కొంతమేరకు మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టింది కానీ ఇంకా ఎక్కువ మోడల్స్ డైరెక్ట్‌గా విదేశాలనుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇంపోర్ట్ అవుతున్నాయి అంటే దానిపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. దానికి జోడీగా GST కూడా పడుతుంది. ఈ రెండూ కలిపేసరికి ఫోన్ అసలు ధరకు 20-25% వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఉదాహరణకి జపాన్‌లో ఐఫోన్ రూ.91,000 ఉంటే అదే ఫోన్ మన దగ్గర రూ.1.34 లక్షలు అవుతుంది.

మన దగ్గర ఐఫోన్ అంటే ఒక లగ్జరీ సింబల్. ఎవరైనా కొత్త ఐఫోన్ కొంటే వెంటనే వావ్ అనిపించేలా ఉంటుంది. కానీ జపాన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో సీన్ మాత్రం డిఫరెంట్. అక్కడ ఐఫోన్ ఒక మిడ్ రేంజ్ ఫోన్‌లా భావిస్తారు. జపాన్‌లో ఐఫోన్ ధర మన దగ్గర ఉన్న హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు దగ్గరగా ఉంటుంది. అందుకే వాళ్లకు ఇది స్పెషల్‌గా అనిపించదు, కేవలం వాడుకోవడానికి సింపుల్ ఫోన్‌లా ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఐఫోన్ కొనగలగడం అంటే ఒక పెద్ద స్టేటస్, లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడ్ అన్నమాట.

ఇండియాలో ఐఫోన్ ధర ఎక్కువగానే ఉంటుంది. దానికి సొల్యూషన్‌గా చాలామంది గ్రే మార్కెట్ లేదా గల్ఫ్ రూట్‌ను ఆశ్రయిస్తారు. UAE, అమెరికా లాంటి దేశాల్లో ఐఫోన్ ధర ఇండియా కంటే చాలా తక్కువ. అందుకే చాలా మంది అక్కడి నుంచి కొనిపించడం లేదా NRI ఫ్రెండ్స్, రిలేటివ్స్ ద్వారా తెప్పించుకోవడం చేస్తారు. గిఫ్ట్‌గా తెప్పించుకోవడం కూడా ట్రెండ్ అయిపోయింది.

ఐఫోన్ ధర పెరిగినా ఇండియన్ యూజర్స్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. EMI సిస్టమ్, ఎక్స్చేంజ్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌ల వల్ల ఎవరైనా కొత్త ఐఫోన్ కొనడం ఈజీ అయిపోయింది. చాలామంది పాత ఫోన్ ఇచ్చేసి EMIలో కొత్త ఐఫోన్ తీసుకోవడమే ట్రెండ్. అంతేకాదు ఇండియాలో ఇంకా చాలా మందికి ఐఫోన్ అంటే ఒక స్టేటస్ సింబల్. ఐఫోన్ వాడుతున్నాడు అంటే లైఫ్ సెటయ్యింది అన్న భావన బలంగా ఉంది. అందుకే ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం డౌన్ కావడం లేదు. యాపిల్‌కి ఇండియా ఒక హాట్ మార్కెట్‌గానే ఉంది. కానీ కస్టమర్లకి మాత్రం అదే ఫోన్ జపాన్‌లో తక్కువ మన దగ్గర ఎక్కువ అనే ఫీలింగ్ మాత్రం తప్పట్లేదు.

Read also :

https://vaartha.com/uddhav-thackeray-meets-raj-thackeray-ubt-mns/business/544754/

Apple iPhone 17 expensive in India Breaking News in Telugu Google News in Telugu iPhone 17 GST and import duty iPhone 17 India vs USA price iPhone 17 international price comparison iPhone 17 luxury phone in India iPhone 17 price difference India vs Japan iPhone 17 price in India iPhone 17 Pro cost comparison Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.