📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Iphone 17 : భారత్ లోనే ఐఫోన్ 17 సిరీస్ తయారి

Author Icon By Sai Kiran
Updated: September 10, 2025 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iphone 17 : టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, (Iphone 17) దేశాన్ని ప్రీమియం పరికరాల తయారీ హబ్‌గా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో ఉత్పత్తి పెరగడంతో, యాపిల్‌కు 20 శాతం దిగుమతి సుంకం నుంచి ఉపశమనం లభిస్తుంది. తమిళనాడు, కర్ణాటకల్లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లలో ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తి జరగనుంది.

గ్రాంట్ థార్న్‌టన్ భరత్ నిపుణుడు క్రిషన్ అరోరా మాట్లాడుతూ – “ఈ నిర్ణయం వల్ల భారత్‌లో ఉద్యోగాలు పెరుగుతాయి, ఎగుమతులు వేగం పొందుతాయి, హై-టెక్ తయారీ రంగంలో దేశం నమ్మకాన్ని సంపాదిస్తుంది. అంతేకాదు, భవిష్యత్‌లో అమెరికా వంటి దేశాల్లో సుంకాల పెరుగుదల నుంచి యాపిల్ రక్షణ పొందుతుంది” అని తెలిపారు.

అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎల్ఐ పథకం కూడా యాపిల్‌కు మేలు చేస్తోంది. ఈ పథకం కింద భారత్‌లో తయారైన ఫోన్లపై 5 ఏళ్లపాటు 4% నుంచి 6% వరకు నగదు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ ప్రోత్సాహకాలు వల్ల 2024-25లో యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2025 మొదటిార్ధంలోనే ఎగుమతులు గతంతో పోలిస్తే 53% పెరిగి 2.39 కోట్ల యూనిట్లకు చేరాయి.

అయితే, నిపుణుల అంచనాల ప్రకారం, భారత వినియోగదారులకు ఐఫోన్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు. కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి రాయితీలు, తక్కువ ధర భూమి, సులభ పర్యావరణ అనుమతులు అందిస్తూ యాపిల్ తయారీ ప్రణాళికలకు మద్దతుగా నిలుస్తున్నాయి.

Read also :

https://vaartha.com/iphone-17-price-india-vs-japan-france/national/544726/

Apple India exports Apple India production news Apple Make in India Apple PLI scheme Breaking News in Telugu Foxconn Tata iPhone production Google News in Telugu iPhone 17 assembly India iPhone 17 job opportunities India iPhone 17 made in India iPhone 17 manufacturing India iPhone 17 manufacturing Tamil Nadu Karnataka iPhone 17 price in India Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.