हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

IPC 498A: భర్త డబ్బుకు లెక్కలడగడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు

Rajitha
IPC 498A: భర్త డబ్బుకు లెక్కలడగడం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు సంసార జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య రోజువారీగా జరిగే మాటపోరాటాలు, చిన్న చిన్న మనస్పర్థలను క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. కుటుంబ ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుకు భర్త లెక్కలు అడగడం సహజమైన విషయమే తప్ప, అది ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా మారదని ధర్మాసనం తేల్చి చెప్పింది. సంసారంలో ఉండే సాధారణ విభేదాలను క్రిమినల్ కేసులుగా మలచడం సమంజసం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Read also: Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. 

IPC 498A

IPC 498A

ఖర్చుల విషయంలో లెక్కలు అడగడం

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఓ ఎన్నారై దంపతులకు 2016లో వివాహమైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2019లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లోని పుట్టింటికి వెళ్లింది. భర్త దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం నోటీసులు పంపిన అనంతరం, భార్య భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. కుటుంబ ఖర్చులకు ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడుగుతున్నారని, భర్త తన తల్లిదండ్రులకు అధిక మొత్తంలో డబ్బు పంపుతున్నాడని ఆమె ఆరోపించింది.

ఈ ఫిర్యాదును సుప్రీంకోర్టు (supreme court) లోతుగా పరిశీలించింది. భర్త తన తల్లిదండ్రులకు డబ్బు పంపడం తప్పుకాదని, ఖర్చుల విషయంలో లెక్కలు అడగడం క్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేసింది. బరువు తగ్గాలని చెప్పడం వంటి అంశాలు వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాల్సిందని, వాటిని 498A నేరంగా చూడలేమని తెలిపింది. భార్య చేసిన ఆరోపణల్లో నేరపూరిత అంశాలు లేవని పేర్కొంటూ, తెలంగాణ హైకోర్టు తిరస్కరించినప్పటికీ సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870