हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Today News : Insurance – జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్టీ రద్దు సిఫారసు

Shravan
Today News : Insurance – జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్టీ రద్దు సిఫారసు

Insurance : దేశవ్యాప్తంగా కోట్లాది మంది బీమా పాలసీదారులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత, ఆరోగ్య బీమా (Health insurance) ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రుల బృందం (జీవోఎం) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే పాలసీల ప్రీమియంలు గణనీ యంగా తగ్గనున్నాయి. పరోక్ష పన్నుల విధానంలో తీసుకురానున్న సంస్కరణలపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి, మం త్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని 18శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించాలని తాము ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

జీఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు రూ.9,700 కోట్ల ఆదాయం నష్టం

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.9,700 కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంచనా వేశారు. బీమా ప్రీమి యంలపై జీఎస్టీ తొలగింపు ప్రయోజనాన్ని ఆయా బీమా సంస్థలు వినియోగదారులకు బదిలీ చేసేలా యంత్రాంగం ఉండాలని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. జీఎస్టీని తొలగించడం లేదా తగ్గించడంపై రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయ ని, ప్రయోజనం బదిలీ చేసే అంశాన్ని రాష్ట్రాలు లేవనెత్తా యని చెప్పారు. జీఎస్టీ (GST) కౌన్సిల్లో దీనిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేసేందుకు జీఎస్టీలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సంస్కరణలను ప్రతిపాదిస్తున్నారు. మంత్రుల బృందం చేసిన ఈ సిఫార్సులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

insurance

జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు

ఈ సమావేశం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీపావళికి ముందే జరిగే అవకాశం ఉంది. కాగా, జీవిత బీమా పన్ను మినహాయింపు ప్రజలకు చేరేలా విధానాన్ని రూపొందించాలనీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జీవిత, ఆరోగ్య బీమా సేవలపై జీఎస్టీ తగ్గింపు లేదా మినహాయింపు అంశాన్ని పరిశీలించి సిఫార్సులు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ రాష్ట్ర మంత్రుల బృందాన్ని (జిఓఎం) ఏర్పాటు చేసింది. ఇందులో బీహార్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో వ్యక్తిగత జీవన బీమా పాలసీలు, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు, వాటికి సంబంధించిన రీ ఇన్సూరెన్స్ పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై విస్తృతంగా చర్చ జరిగింది.

ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూరినప్పుడే ఈ చర్య లక్ష్యాన్ని చేరుకుంటుందని, అయినప్పటికీ రాష్ట్రాలకు కొంత మేర ఆదాయం నష్టం వాటిల్లి, అది ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించదగిన నిధులు తగ్గిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే 95 లక్షల కుటుంబాలకు బీమా సేవలు అందజేస్తోందని భట్టి సమావేశంలో తెలిపారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/liquor-tenders-invitation-for-tenders-for-liquor-shops/telangana/533742/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870