📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Infosys : టీసీఎస్‌ లేఆఫ్స్‌ వేళ.. ఇన్ఫోసిస్‌ రిక్రూట్మెంట్ ప్రకటన

Author Icon By Sudha
Updated: July 30, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్‌ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నియామక (Recruitment)వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ ఈ ఏడాది దాదాపు 20,000 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే లక్ష్యం వేసుకున్నట్లు వెల్లడించింది. ఇది ఉన్నత విద్యాసంస్థల నుంచి సరికొత్త టాలెంట్‌ను తీసుకోవాలన్న దృష్టితో తీసుకున్న నిర్ణయం. టెక్నాలజీ, డిజిటల్‌ సేవలు, డేటా ఎనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వంటి రంగాల్లో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఈ నియామకాలను చేపట్టనుంది.

Infosys : టీసీఎస్‌ లేఆఫ్స్‌ వేళ.. ఇన్ఫోసిస్‌ రిక్రూట్మెంట్ ప్రకటన

ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఓ జాతీయ మీడియాతో ఇన్ఫీ(Infosys) సీఈఓ సలీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే భారీగా హైరింగ్‌కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు. ‘ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం. మొత్తం 2025 సంవత్సరానికి 20 వేల మంది కాలేజ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావిస్తున్నాం. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ మార్పులు, తదితర రంగాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఇప్పటివరకు సంస్థ దాదాపు 2.75 లక్షల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో డిజిటల్, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది’ అని సీఈఓ వెల్లడించారు.

ఇన్ఫోసిస్ యజమాని ఎవరు?

నాగవర రామారావు నారాయణ మూర్తి (జననం 20 ఆగస్టు 1946) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మరియు పదవీ విరమణ చేసి చైర్మన్ ఎమెరిటస్ అయ్యే ముందు కంపెనీకి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అధ్యక్షుడు మరియు చీఫ్ మెంటర్‌గా పనిచేశారు.

ఇన్ఫోసిస్ దేనికి ప్రసిద్ధి చెందింది?

ఇన్ఫోసిస్ దాని ఐటీ కన్సల్టింగ్ మరియు అవుట్‌సోర్సింగ్ సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు సేవలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడే గ్లోబల్ డెలివరీ మోడల్‌ను రూపొందించిన మొదటి సంస్థ ఇది.

ఇన్ఫోసిస్ ఏ దేశానికి చెందినది?

ఇన్ఫోసిస్ అనేది 300,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నెట్‌వర్క్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాలలోని కంపెనీలకు డిజిటల్ సేవలు మరియు కన్సల్టింగ్‌ను అందించే ప్రపంచవ్యాప్త సంస్థ. దీనిని భారతదేశంలోని పూణేలో ఏడుగురు ఇంజనీర్ల బృందం 1981లో స్థాపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: NISAR : శ్రీహరికోట నుంచి నిసార్ ఉపగ్రహం, GSLV-F16 ప్రయోగం

Breaking News fresher hiring infosys jobs infosys recruitment it jobs latest news tcs layoffs tech hiring Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.