జగన్మాతకు వేడుకగా ఆషాఢం సారె సమర్పణ
Indrakeeladri: దుర్గమ్మవారికి విజయవాడకు చెందిన జంధ్యాల కుమారస్వామి తమ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం రు. 5లక్షలు విలువైన 61 గ్రాముల బంగారు మంగళసూత్రాలు, బంగారు చైనులను కానుకగా అందించారు. దాతకు వారి కుటుంబసభ్యులకు (Indrakeeladri) దుర్గమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు అనంతరం వారికి దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటో అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. దుర్గమ్మవారికి సెక్యూరిటీ విభాగం ఆషాడం సారె: దుర్గమ్మవారికి ఆలయంలో సెక్యూరిటీ విభాగంలో సేవలందిస్తున్న ఏజిఎల్ఎఇ సెక్యూరిటీ సర్వీసెస్ వారు సోమవారం ఆషాడం సారెను అందించారు. ముందూ జమ్మిదొడ్డిలోని శ్రీ అమ్మవారికి ఇఓ వికె శీనా నాయక్ ఆలయానికి అనంతరం ఆషాడం సారెను తీసుకుని శ్రీ అమ్మవారి అక్కడ మేళతాళాలు, మంగళవాయిద్యాలతో మంత్రపఠనాల నడుమ స్వాగతం పలికి ఆషాడం సారెను శ్రీ అమ్మవారికి నివేదించారు. జగన్మాతకు భక్తుల జయనాదాలతో ఆషాడం సారె: జగన్మాత దుర్గమ్మ వారికి సోమవారం భక్తబృందాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆషాడం సారెను సమరి ్పంచారు. మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ పలు ప్రాంతాలకు చెందిన బృందాలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి దుర్గమ్మవారికి సారె సమర్పించారు. ఆషాడం సారె సమర్పించిన భక్తుల బృందాలకు దుర్గమ్మవారి దర్శనంఏర్పాటు చేసిన అధికారులు అన్నప్రసాదాలు అందించారు.
విజయవాడ కనక దుర్గ టెంపుల్ స్టోరీ?
కనకదుర్గ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, పౌరాణిక కథల నిధి కూడా. అలాంటి ఒక కథ ఏమిటంటే, ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే దాని గురించిన పురాణం . పురాణాల ప్రకారం, దేవతల రాజు ఇంద్రుడు ఒకప్పుడు వశిష్ట అనే ముని ఆవును చంపడం ద్వారా ఘోరమైన పాపం చేశాడు.
ఇంద్రకీలాద్రి కొండ ఎత్తు ఎంత?
ఇంద్రకీలాద్రి కొండల అడుగుజాడల్లో తూర్పు ముఖంగా ఉన్న రెండు రాతి గుహలు విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం పిన్ 520010. ఇంద్రకీలాద్రి భౌగోళిక అక్షాంశాలు 16°30’49” ఉత్తరం (అక్షాంశం), 80°36’23” తూర్పు (రేఖాంశం) వద్ద ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి సగటున 39 అడుగుల ఎత్తులో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: AP Free bus: మహిళలకు ఆర్టీసి ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్: సిఎం చంద్రబాబు