Indore: చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత

Read Time:  1 min
Indore: చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత
FONT SIZE
GET APP

Indore: మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని బోర్సీ గ్రామంలో చదువు కోసం ఓ వివాహిత హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. చదువుకోవాలనే తన కోరికకు భర్త కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ ప్రమాదకర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also:Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం

Indore
Indore: Married woman climbs high-tension tower for studies

గ్రామ శివార్లలోని 400 కిలోవాట్ల హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన ఆమె, చదువుకోనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురై పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెతో చర్చలు జరిపి కౌన్సెలింగ్ చేశారు. చివరికి భర్త కుటుంబ సభ్యులు ఆమెకు చదువుకు అనుమతి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆమె కిందకు దిగింది. ఈ ఘటన చదువుపై ఆమెకు ఉన్న గాఢమైన ఆసక్తిని చూపించిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.