Indigo : భారతదేశపు ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ (IndiGo) అంతర్జాతీయ ప్రయాణికులకు షాకిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లోని అత్యంత ఆదరణ పొందిన 6 ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. రాబోయే జులై 1వ తేదీ నుండి మలేషియాలోని లాంగ్‌కావి, థాయ్‌లాండ్‌కు చెందిన క్రాబి, వియత్నాంలోని హో చి మిన్ సిటీ, హాంకాంగ్, అలాగే చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలకు విమానాల రాకపోకలను బంద్ చేయనున్నారు. వీటితో పాటు జులై 3వ తేదీ నుండి కాంబోడియాలోని సియాం రీప్‌కు కూడా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం ప్రస్తుతానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఇండిగో యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
Read Also : అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్
పెరిగిన నిర్వహణ ఖర్చులు – తగ్గిన డిమాండే ప్రధాన కారణం!
ఇండిగో సంస్థ ఈ హఠాత్తు నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన ఆర్థిక, వ్యూహాత్మక కారణాలు ఉన్నట్లు విమానయాన రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు (ATF) పెరగడం, విమానాల నిర్వహణ ఖర్చులు (Operational Costs) భారీగా కావడం ఒక కారణమైతే.. సదరు రూట్లలో ఆశించిన స్థాయిలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడం మరో ప్రధాన కారణం. ముఖ్యంగా వర్షాకాలం (Monsoon Season) కావడంతో ఈ ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా తగ్గింది. నష్టాలతో సర్వీసులను నడపడం కంటే, డిమాండ్ తక్కువగా ఉన్న కాలంలో వాటిని తాత్కాలికంగా నిలిపివేయడమే ఉత్తమమని సంస్థ భావించింది. అయితే, పీక్ టూరిజం సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్ నుండి ఈ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :