📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Telugu News: Indigo: రూ.58 కోట్ల జరిమానా తో ఇండిగోకు కోలుకొని దెబ్బ

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కొద్ది రోజులుగా వందల కొద్దీ విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Read Also: Indian Citizenship: భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

జీఎస్టీ జరిమానా విధింపు

ఇదే సమయంలో ఇండిగో కంపెనీకి రూ.58.75 కోట్ల జీఎస్టీ జరిమానా విధిస్తూ పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన సీజీఎస్టీ అదనపు కమిషనర్ కార్యాలయం నుంచి నిన్న ఈ ఆర్డర్ అందినట్లు సంస్థ తెలిపింది.

IndiGo suffers blow after being hit with Rs 58 crore fine

డీజీసీఏ కఠిన చర్యలు

మరోవైపు ఇండిగోలో నెలకొన్న గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో భద్రత మరియు కార్యాచరణ ప్రమాణాలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను వారి విధుల నుంచి తొలగించింది.

ప్రత్యేక పర్యవేక్షణ బృందాల ఏర్పాటు

పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను గురుగ్రామ్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు డీజీసీఏకు వివరణాత్మక నివేదిక సమర్పిస్తాయి.

పర్యవేక్షణ కార్యక్రమం

మొదటి బృందం విమానాల సంఖ్య, పైలట్ల లభ్యత, సిబ్బంది పనిగంటలు, శిక్షణ షెడ్యూళ్లు వంటి కార్యాచరణ అంశాలను పరిశీలిస్తుండగా, రెండవ బృందం ప్రయాణికులపై ప్రభావం, రిఫండ్‌ల స్థితి, సామాను తిరిగి ఇవ్వడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air travel Aircraft Operations Airlines Aviation Crisis aviation safety Budget Airlines civil aviation DGCA flight cancellations Flight Inspectors Google News in Telugu GST Penalty Gurugram Indian Aviation Indigo InterGlobe Aviation Latest News in Telugu Passenger Troubles Pilot Shortage Regulatory Action Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.