ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం (Indigo flight) బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్ర కుదుపులకు లోనైంది.వడగళ్ల తుఫాన్ కారణంగా ప్రయాణికులు క్షణాల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు.కానీ, పైలట్ సాహసంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ (The plane landed safely) అయ్యింది.ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E2142 విమానం,(6E2142 aircraft) బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది.ఈ విమానంలో 227 మంది ప్రయాణికులు ఉన్నారు.శ్రీనగర్ చేరేందుకు విమానం అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మికంగా వడగళ్ల వానతో కూడిన తుఫాను ఏర్పడింది.విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిసిపడుతూ ప్రయాణికుల్లో భయాన్ని కలిగించింది.
పాక్ గగనతలంలోకి అడుగుపెట్టి – తిరస్కరణ ఎదురైంది
తుఫానును తట్టుకోలేని పరిస్థితుల్లో, పైలట్ సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు.తుఫాను నుంచి విమానాన్ని దూరంగా తీసుకెళ్లేందుకు కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరారు.అయితే, పాక్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం,(However, it is reported that Pakistani ATC officials have rejected this request)
పైలట్ చాకచక్యం – ప్రయాణికులందరూ సురక్షితం
పాకిస్థాన్ నుంచి అనుమతి లభించకపోయినా,పైలట్ తన అనుభవాన్ని ఉపయోగించి తుఫాను మధ్యలో విమానాన్ని సమతుల్యంగా నడిపాడు.సాయంత్రం 6:30కి శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని తెలియజేశాడు.అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానం ముక్కు భాగం దెబ్బతిన్నా ప్రాణాలకు ముప్పు లేదు
ఈ సంఘటనలో విమానం ముందుభాగంలోని ముక్కు (నోస్) దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.అయితే ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని ఇండిగో ప్రకటించింది.ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.దెబ్బతిన్న విమానాన్ని “ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్”గా గుర్తించి,మరమ్మతులు పూర్తయ్యేవరకు సేవల నుంచి తొలగించారు.విమానానికి అవసరమైన నిర్వహణ పనులు త్వరితగతిన చేపడుతున్నారు.
పాక్ తిరస్కరణపై చర్చ
పుల్వామా దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే.అదే తరహాలో ఇప్పుడు కూడా ఇండిగో విమానం అభ్యర్థనను తిరస్కరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ అంశం మళ్లీ భారత్–పాక్ గగనతల దౌత్యంపై దృష్టి పెట్టేలా చేసింది.
Read Also : Ahmed Sharif Chaudhry : మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం.. పాక్ సైనిక ప్రతినిధి