📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest News: Indigo: ఇండిగో సంక్షోభ సమయంలో టికెట్ ధరలు రూ.40 వేలా?

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 5:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత వారం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దులు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వందల సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయారు. నిన్నటి నుంచి కొన్ని సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటికీ, సంక్షోభం కారణంగా జరిగిన ఇబ్బందులు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇండిగో ఫ్లైట్లు పెద్ద ఎత్తున రద్దు కావడంతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. (Indigo) సాధారణంగా రూ.15 వేలకే లభించే ముంబై–ఢిల్లీ ఫ్లైట్‌ టికెట్ ఈ పరిస్థితుల్లో ₹39–40 వేల వరకు చేరింది. రెండు, మూడు రెట్లు పెరిగిన ధరలు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

Read also: భారత్ రైస్ ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రగామి

Indigo Are ticket prices Rs. 40,000 during the Indigo crisis?

ఇండిగో రద్దులపై హైకోర్టు ప్రశ్నలు

దానిపై(Indigo) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ఈరోజు విచారణ చేపట్టింది. సంక్షోభం ఎందుకు వచ్చిందో, ముందే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదో కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంక్షోభ సమయంలో ఇతర కంపెనీలు టికెట్ ధరలు ఇష్టానుసారం పెరగడానికి కోర్టు వివరణ కోరింది. ప్రయాణికులు ఇబ్బందుల్లో కూరుకుపోయినా, సరైన సహాయక చర్యలు ఎందుకు లేవు? ఫ్లైట్ టికెట్లు ఏకంగా ₹40 వేల వరకు ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలను వరుసగా కేంద్రానికి సంధించింది. కేంద్రం తీసుకున్న చర్యలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించినప్పటికీ, న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఈ సంక్షోభంపై పూర్తి సమాచారం అందించాలని డీజీసీఏ ఇండిగో సంస్థను ఆదేశించింది. రద్దైన ఫ్లైట్ల వివరాలు, రీఫండ్‌లపై సమాచారం, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది లభ్యత, భవిష్యత్తులో సేవల పునరుద్ధరణ ప్రణాళిక వంటి డేటాను సమగ్రంగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ,సంబంధిత అధికారులను రేపు మధ్యాహ్నం డీజీసీఏ కార్యాలయానికి పిలిపించారు. ఇండిగో విమానాల అంతరాయంపై స్పష్టమైన నివేదికను పొందిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు నిర్ణయిస్తామని డీజీసీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ విమాన సంక్షోభం ప్రయాణికులకు మాత్రమే కాకుండా విమానయాన రంగానికి కూడా గట్టి హెచ్చరికగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Airfare Hike Airline Delays Aviation Crisis DGCA domestic flights Flight Strike Indigo Latest News in Telugu Passenger Impact Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.