ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను (నేటి నుంచి) జనవరి 1న ప్రారంభించనుంది. అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాప్‌ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చౌకైన సేవలను ప్రవేశపెడుతున్నారు. భారత్ టాక్సీ యాప్‌లో బైక్, ఆటో, కారు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
Read Also: Energy Efficiency:కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు
ప్రైవేట్ యాప్స్‌లో రైడ్‌ను బుక్ చేసుకున్న తర్వాత పలుమార్లు రైడర్లు రద్దు చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు డ్రైవర్లు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల రైడ్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎక్కువమంది డ్రైవర్లు బుక్ చేసుకునేలా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. దీని వల్ల ఎక్కువమంది రిజిస్టర్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు వెంటనే బుకింగ్ అవుతుంది. తక్కువ ధరకే సేవలు అందించడంతో పాటు యాప్‌ను సజావుగా నడిపిస్తే కేంద్ర ప్రభుత్వంలోని భారత్ ట్యాక్సీ యాప్ ప్రైవేట్ కంపెనీలకు పోటీ ఇవ్వడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డ్రైవర్లకు కూడా ఎక్కువ బుకింగ్స్ వచ్చి సంపాదన పెరిగితే యాప్ మరింతగా ప్రజల్లోకి వెళ్లనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: