తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే (IndianRailways)లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ జోన్‌లో మొత్తం 1,763.26 కిలోమీటర్ల మేర విస్తరించిన 18 రైల్వే ప్రాజెక్టులను ₹27,342.44 కోట్ల వ్యయంతో గతంలో మంజూరు చేశారు.
Read Also: Railway Budget 2026: రైల్వే రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు
ఈ ప్రాజెక్టులలో భాగంగా ₹4,684 కోట్ల అంచనా వ్యయంతో ముద్ఖేడ్–డోన్ రైలు మార్గానికి విద్యుదీకరణ, ₹3,591 కోట్లతో 173 కిలోమీటర్ల(IndianRailways) పాండురంగాపురం లైన్ అభివృద్ధి, అలాగే విజయవాడ–ఖాజీపేట మధ్య మూడో లైన్ నిర్మాణాన్ని ₹3,103 కోట్లతో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల సికింద్రాబాద్–వాడి మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ₹5,012 కోట్ల నిధులను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికుల రాకపోకలు సులభమవడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: