📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

Author Icon By Pooja
Updated: December 17, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రైల్వే(Indian Railways) ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే వేగం, సౌకర్యాలతో ప్రజాదరణ పొందిన వందే భారత్ రైళ్లను ఇప్పుడు స్లీపర్ కోచ్‌లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరికల్లా వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపైకి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read Also:EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

Vande Bharat sleeper trains coming soon.

దూర ప్రయాణికుల కోసం స్లీపర్ వందే భారత్

ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు(Indian Railways) సీటింగ్ సౌకర్యంతో మాత్రమే ఉండటంతో, దీర్ఘదూర ప్రయాణాలు చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రిపూట ప్రయాణాలకు అనువుగా స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రైళ్ల తయారీ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి.

తొలి వందే భారత్(Vande Bharat) స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను పాట్నా – ఢిల్లీ మధ్య ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో ఈ రైలు పూర్తి చేయనుంది. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది.

వారానికి ఆరు రోజులు సర్వీస్

ఈ స్లీపర్ వందే భారత్ రైలు ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కొత్త ఏడాది రాకముందే ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. వారానికి ఆరు రోజులు పాట్నా – ఢిల్లీ మధ్య ఈ రైలు నడవనుంది. మొత్తం 16 కోచ్‌లు ఇందులో ఉండనున్నాయి. ఛార్జీల వివరాలను ఇంకా ప్రకటించలేదు కానీ, సేవలు రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఉంటాయని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళిక

రాత్రిపూట ప్రయాణాల్లో ఎక్కువ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. స్లీపర్ కోచ్‌లతో పాటు అధునాతన సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాలను కవర్ చేసేలా ఈ రైళ్లను విస్తరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu RailwayNews VandeBharatSleeper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.