Vande Bharat Sleeper Trains: కొత్త ఏడాది ఆరంభంలోనే దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందనుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు జనవరి నుంచే అందుబాటులోకి రానున్నట్లు భారతీయ రైల్వే(Indian Railways) అధికారికంగా వెల్లడించింది. ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, కొన్నిచిన్న మార్పులు చేసిన అనంతరం త్వరలోనే వాణిజ్య సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.
Read Also: Online Services: కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు
164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
రైల్వే శాఖ ప్రకారం, నాన్-ఏసీ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమృత్ భారత్ రైళ్లను, ఏసీ సదుపాయాలతో దీర్ఘదూర ప్రయాణాలకు అనువుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Bharat Express) సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయని, ఈ ఏడాదిలోనే ప్రధాని నరేంద్ర మోదీ 42 కొత్త రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారని రైల్వే శాఖ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: