కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ స్లీపర్ (Vande Bharat Express) రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముందుగా కోల్‌కతా–గుహవాటి మార్గంలో తొలి రైలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రైలు జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఈ రైళ్లను రూపొందించినట్లు చెప్పారు.
Read also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?
Good news from the Central Railway Ministry
ఈ రైలులో మొత్తం 828 మంది ప్రయాణించవచ్చు
కోల్‌కతా–గుహవాటి మధ్య విమాన టికెట్ల ధరలు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఉండగా, వందే భారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.2,300గా నిర్ణయించారు. సెకండ్ ఏసీ దాదాపు రూ.3,000, ఫస్ట్ ఏసీ రూ.3,600గా ఉండనుంది. ఈ రైలులో మొత్తం 828 మంది ప్రయాణించవచ్చు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: