రైల్వే శాఖ (Indian Railway) పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా రూ.600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ (Indian Railway)లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపునకు ప్రయాణికులు సిద్దం కావాల్సిందే. రైళ్లలో జనరల్ టికెట్లకు 215 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కిలోమీటరుకు 1 పైసా అదనపు ఛార్జీ విధిస్తున్నారు.
Read Also: SCR: సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే
నాన్-ఏసీ ట్రిప్‌కు అదనంగా రూ.10
216 కి.మీ నుంచి 750 కి.మీ వరకు రూ. 5 మేరకు పెరగనుండగా.. 751 కి.మీ నుంచి 1250 కి.మీ మధ్య దూరానికి రూ. 10, 1251 కి.మీ నుంచి 1750 కి.మీ మధ్య దూరానికి రూ. 15, 1751 కి.మీ నుంచి 2250 కి.మీ మధ్య దూరానికి రూ. 20 మేరకు పెరగనుంది.అయితే మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసల పెరుగుదల ఉంటుంది. ఈ లెక్కన చూస్తే 500 కి.మీ నాన్-ఏసీ ట్రిప్‌కు అదనంగా రూ.10 ఖర్చవుతుంది.
215 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణించే మార్గాలకు ఛార్జీలు పెరగట్లేదు. పేద, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కూడా ఇందులో ఊరట లభించనుంది. ప్రతీ నెలా వారు తీసుకునే సీజనల్ సబర్బన్ , నెలవారీ టిక్కెట్లకు ఛార్జీల పెంపు వర్తించదు. పదేళ్లుగా రైల్వేలు తమ నెట్‌వర్క్ పెంచుకోవడం, మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: