Syed hamid : భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రముఖ అధ్యాయం ముగిసింది దేశానికి గర్వకారణమైన మాజీ ఒలింపియన్ సయ్యద్ హబీబుల్ హసన్ హమీద్ 85 సంవత్సరాల వయసులో హైదరాబాద్‌లో కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణవార్తతో క్రీడా ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది నగరంలోని విజయనగర్ కాలనీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం హమీద్ క్రీడా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కేవలం 19 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికై ఆ ఒలింపిక్స్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా ఆయన గుర్తింపు పొందారు
అదే సమయంలో 1960 ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో కూడా ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు దేశానికి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటగాళ్లలో ఆయన ఒకరిగా నిలిచారు
ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో 1941లో జన్మించిన హమీద్ హైదరాబాద్‌లోనే ఫుట్‌బాల్‌లో తన ప్రతిభను చాటుకున్నారు ఫార్వర్డ్ ఆటగాడిగా ఆయన మైదానంలో వేగం మరియు నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు
Read Also: Washing machine offers : రూ.19 వేలు వాషింగ్ మెషీన్ ఇప్పుడు ఏడు వేలకే భారీ ఆఫర్
పీకే బెనర్జీ చునీ గోస్వామి లతీఫ్ వంటి ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజాలతో కలిసి ఆయన ఆడారు ఆయన ఎదుగుదలలో కోచ్ ఎస్ ఏ రహీం కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ స్పోర్టింగ్ హైదరాబాద్ పోలీస్ మరియు కోల్‌కతాకు చెందిన మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌లకు ఆయన కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు
ఒకప్పుడు భారత ఫుట్‌బాల్‌కు కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ కీర్తి తగ్గిపోవడం పట్ల హమీద్ తన చివరి రోజుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారని ఆయనకు సన్నిహితులు తెలిపారు
ఆయన మరణంపై భారత మాజీ కెప్టెన్ విక్టర్ అమల్రాజ్ మరియు తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
హమీద్‌కు ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆయన భార్య ఇప్పటికే మరణించారు ఆయన సేవలు భారత ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: