Indian Embassy Advisory: ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

Read Time:  1 min
Indian Embassy Advisory: ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్
FONT SIZE
GET APP

Indian Embassy Advisory: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు, అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

Read Also: Israel Iran War: ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్


ప్రధాన సూచనలు..

స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి.

ఇజ్రాయెల్ అధికారులు, ‘హోమ్ ఫ్రంట్ కమాండ్’ జారీ చేసే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తప్పనిసరిగా పాటించాలి.

నివాస ప్రాంతాల్లో లేదా కార్యాలయాల వద్ద ఉన్న రక్షణ కేంద్రాలు, సురక్షిత గదుల గురించి ముందే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి.

ఇజ్రాయెల్ దేశం లోపల అత్యవసరం కాని ప్రయాణాలను ప్రస్తుతానికి పూర్తిగా వాయిదా వేసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.