📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Jammu & Kashmir : పాకిస్థాన్ లైవ్ షెల్‌ను నిర్వీర్యం చేసిన సైన్యం

Author Icon By Sudheer
Updated: May 20, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌(Jammu & Kashmir)లో పూంచ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటనలో భారత సైన్యం అప్రమత్తతతో పెద్ద ప్రమాదాన్ని నివారించింది. పాకిస్థాన్ సైన్యం ప్రయోగించిన లైవ్ షెల్‌ (Live Shell) రోడ్డుపక్కనే పడివుండటాన్ని గ్రామస్తులు గుర్తించి సైన్యానికి సమాచారం అందించగా, వెంటనే స్పందించిన బాంబు స్క్వాడ్‌ షెల్‌ను నిర్వీర్యం చేసింది. ఈ ఘటన దారా బగ్యాల్ గ్రామంలో చోటుచేసుకోగా, అక్కడి ప్రజలు భారత సైన్యంపై అభినందనలు వెల్లువెత్తించారు. “సైన్యం వేగంగా స్పందించి, షెల్‌ను సురక్షితంగా తొలగించింది. ఎంతోమందికి ప్రాణాపాయం తప్పింది” అని గ్రామస్థులు తెలిపారు.

పాక్ దాడులు – సరిహద్దు ప్రజలకు కష్టాల పాలు

ఇటీవల కాలంలో భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాక్ సైన్యం పౌర నివాసాలపై షెల్లింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో పలు గ్రామాలు, ఇళ్లు నాశనమయ్యాయి. పాడిపశువులు చనిపోయాయి. రాజౌరీ జిల్లా నివాసితుడు మోహమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం, షెల్లింగ్ కారణంగా అతని ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. తాత్కాలిక నివాసాల అవసరాన్ని ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నౌషేరా వంటి ఇతర సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రజలు భూములు, జీవనాధారాలను కోల్పోయి తీవ్రంగా బాధపడుతున్నారు.

భారత సైన్యం ప్రతీకారం – సరిహద్దుల్లో ప్రశాంతత

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి రాజౌరీ జిల్లాలోని సరిహద్దు గ్రామాలను సందర్శించి బాధితుల బాధలను అడిగి తెలుసుకున్నారు. మే 7న ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాక్‌కు గట్టి బుద్ధిచెప్పిన భారత సైన్యం, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం పాక్‌కు చెందిన కీలక ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. దీంతో మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణపై అంగీకరించగా, అప్పటి నుంచి సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాఠశాలలు మే 19 నుంచి పునఃప్రారంభమయ్యాయి, కానీ అక్కడి ప్రజల్లో భయాందోళనలు ఇంకా తొలగలేదు.

Read Also : Israel PM On Gaza: గాజా మొత్తం స్వాధీనం చేసుకుంటాం – నెతన్యాహు ప్రకటన

Google News in Telugu Indian Army's bomb disposal Jammu And Kashmir Poonch district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.