📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

India Tourism: వింటర్ సీజన్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇవే బెస్ట్ డెస్టినేషన్స్

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం(India Tourism) అనగానే అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, చారిత్రక వైభవం కళ్లముందు నిలుస్తాయి. దేశంలో ఏ మూలకు వెళ్లినా చూసేందుకు ప్రత్యేకమైన ప్రదేశాలు, తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉంటాయి. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా చాలా మంది పర్యటనలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ట్రావెల్‌కు శీతాకాలం చాలా అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో పాటు ప్రకృతి అందాలు మరింత ఆకట్టుకుంటాయి. మరి శీతాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో

శీతాకాలంలో మంచు అందాలను ఆస్వాదించాలంటే కాశ్మీర్ టూర్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా గుల్మార్గ్ ప్రాంతం స్వర్గధామాన్ని తలపిస్తుంది. చుట్టూ తెల్లటి మంచు పరచుకుని ఉండే ఈ ప్రాంతం టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంది. గుల్మార్గ్‌లో స్కీయింగ్, స్నో బోర్డింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కేబుల్ కార్ ప్రయాణంగా పేరుగాంచిన గోండోలా రైడ్ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అలాగే దాల్ సరస్సులో బోటింగ్ చేయడం జీవితకాలం మర్చిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది.

అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. గంగా నది తీరంలో ఉన్న ఈ పట్టణాల్లో డిసెంబర్ నెలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆధ్యాత్మికతతో పాటు అడ్వెంచర్ టూరిజానికి కూడా ఇవి ప్రసిద్ధి. రివర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, యోగా ఆశ్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. సాయంత్రం వేళ జరిగే గంగా హారతి దృశ్యం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. హరిద్వార్‌లో భారతమాత ఆలయం, చండీ దేవి ఆలయం, మానసా దేవి ఆలయానికి వెళ్లే రోప్‌వే ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలంటే కేరళలోని మున్నార్, అలప్పుజ ప్రాంతాలను సందర్శించాల్సిందే. మున్నార్ సుందరమైన టీ తోటలు, కొండల మధ్య చల్లని వాతావరణంతో ఉన్న హిల్ స్టేషన్ కాగా, అలప్పుజ బ్యాక్‌వాటర్స్, హౌస్‌బోట్ క్రూయిజ్‌లకు ప్రసిద్ధి చెందింది. హౌస్‌బోట్‌లో రాత్రి బస చేస్తూ కేరళ సంప్రదాయ భోజనాలను రుచిచూడటం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అలాగే ఆయుర్వేద చికిత్సలు, పచ్చని ప్రకృతి ఈ ప్రాంతాలను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఇక గోవా అందాలు మాటల్లో వివరించలేనంత విశేషంగా ఉంటాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో న్యూ ఇయర్ వేడుకల కారణంగా గోవా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడి బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, సీ ఫుడ్, నైట్ పార్టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతేకాదు, పురాతన చర్చిలు, సన్‌రైజ్ మరియు సన్‌సెట్ పాయింట్లు గోవా పర్యటనకు మరింత ఆకర్షణను జోడిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Best Winter Destinations Haridwar Rishikesh India tourism Kashmir Gulmarg Snow Tourism India Winter Travel India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.