ప్రపంచ ఆర్థిక రంగం (Global economy)లో భారత్ తన స్పష్టమైన ముద్ర వేస్తోంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ EY తాజా నివేదిక ప్రకారం, భారత్ భవిష్యత్‌లో కీలక మైలురాళ్లు అధిగమించనుంది.మార్కెట్ మారకపు విలువ ఆధారంగా, భారత్ 2028 నాటికి జర్మనిని అధిగమించనుంది. అంతేకాకుండా, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పద్ధతిలో 2038 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి చేరనుందని అంచనా.ఈవై నివేదిక అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో భారత్ వృద్ధికి ప్రధానంగా సహకరిస్తున్న అంశాలను స్పష్టంగా చూపించారు.వీటిలో యువశక్తి, పొదుపు రేటు, అంతర్గత డిమాండ్, ఆర్థిక స్థిరత్వం కీలకంగా నిలిచాయి.
యువతే మన బలం
2025 నాటికి భారత్ సగటు వయస్సు 28.8 సంవత్సరాలు. ఇదే భారత్‌కు పెద్ద బలంగా మారనుంది. మిగతా పెద్ద దేశాల్లో జనాభా వృద్ధాప్యంలోకి వెళ్తోంది.చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలు జనాభా పతనంతో, అధిక అప్పులతో పోరాడుతున్నాయి. కానీ భారత్‌కు సమర్థవంతమైన మానవ వనరుల బలం ఉంది.PPP పద్ధతిలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి $20.7 ట్రిలియన్కు చేరనుంది. అదే సమయంలో జీడీపీపై అప్పు నిష్పత్తి కూడా తగ్గనుంది.2024లో ఇది 81.3%గా ఉండగా, 2030 నాటికి 75.8%కు పడిపోవచ్చు. దీని వెనుక కీలక ఆర్థిక విధానాల ప్రాభావం ఉన్నది.ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ:“భారత్ వద్ద ఉన్న యువత, స్కిల్‌డ్ మానవ వనరు పెద్ద అస్త్రం. పెట్టుబడులు పెరుగుతున్నాయి. పొదుపు రేట్లు బలంగా ఉన్నాయి.భారత్‌కు ఉన్న స్థిరమైన రుణ ప్రొఫైల్ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది,” అని అన్నారు.
వికసిత భారత్ లక్ష్యం వైపు మద్దతుగా సంస్కరణలు
భారత్ 2047 నాటికి ‘వికసిత దేశం’గా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈవై నివేదిక ప్రకారం, దేశంలో జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు ఈ దిశగా సహాయపడుతున్నాయి.డిజిటల్ మౌలిక వనరులు, స్టార్టప్‌ల అభివృద్ధి, విదేశీ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు భారత్‌కు ప్లస్ పాయింట్లు.ఇలా చూస్తే, ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ స్పష్టమైన ప్రాభావం చూపుతోంది. యువత, వ్యూహాత్మక విధానాలు, పెట్టుబడి సౌకర్యాలు కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
Read Also :