భారత వ్యవసాయ రంగం రికార్డు సృష్టించింది. గత దశాబ్దంలో ఎన్నడూ లేని రీతిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి 357.73 మిలియన్ టన్నులు చేరిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.. ఈ సంఖ్య భారత వ్యవసాయ చరిత్రలోనే అత్యధికం.
Read Also: Bengaluru Traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాన్షు శుక్లా వ్యంగ్యాస్త్రాలు
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారీ వృద్ధి
2015-16లో 251.54 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, ఇప్పుడు ఏకంగా 106 మిలియన్ టన్నులు పెరగడం గమనార్హం.ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) వెల్లడించారు. బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,501.84 లక్షల టన్నులకు చేరిందని, ఇది గతేడాది (1,378.25 లక్షల టన్నులు) కంటే 123.59 లక్షల టన్నులు అధికమని తెలిపారు.
గోధుమల ఉత్పత్తి కూడా 46.53 లక్షల టన్నులు పెరిగి 1,179.45 లక్షల టన్నులకు చేరిందని వివరించారు.నూనె గింజల ఉత్పత్తి సైతం 2024-25లో రికార్డు స్థాయిలో 429.89 లక్షల టన్నులకు చేరినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా వేరుశనగ 119.42 లక్షల టన్నులు, సోయాబీన్ 152.68 లక్షల టన్నుల దిగుబడితో ఈ వృద్ధికి దోహదపడ్డాయి.
వ్యవసాయ రంగం మోదీ నాయకత్వంలో వేగంగా వృద్ధి
వీటితో పాటు మొక్కజొన్న 434.09 లక్షల టన్నులు, ‘శ్రీ అన్న’ (చిరుధాన్యాలు) 185.92 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయ్యాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో వ్యవసాయ రంగం వేగంగా వృద్ధి చెందుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
‘పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి మిషన్’ వంటి కార్యక్రమాలు ఉత్పత్తిని మరింత పెంచుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కంది, మినుములు, శనగ, పెసర వంటి పంటలకు కనీస మద్దతు ధర (MSP)తో కొనుగోలు హామీ ఇవ్వడం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: