📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India Pakistan War: సైన్యానికి మీ సేవలు అవసరం అన్నకేంద్రం

Author Icon By Ramya
Updated: May 9, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ కౌంటర్ అటాక్: పాకిస్తాన్‌పై మిస్సైళ్ల వర్షం

భారత్ ప్రతీకార యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ సాయుధ దళాలు జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ పొడవునా జరిగిన దాడులకు భారత్ గట్టి బదులిచ్చింది. గురువారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, మోర్టార్లు, మిస్సైళ్లతో భారీ దాడికి పాల్పడగా, భారత భద్రతా దళాలు అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాయి. ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించినా, భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ చేసి నాశనం చేసింది. తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి ముఖ్య నగరాలపై టార్గెట్లతో మిస్సైళ్ల వర్షం కురిపించింది.

నగరాలు ఖాళీ అవుతున్న పాక్: ప్రజలు భయంతో తల్లడిల్లిన పరిస్థితి

భారత్ రాత్రంతా చేపట్టిన కౌంటర్ దాడులతో పాకిస్తాన్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. శత్రు మిస్సైళ్ల బెడద నుండి తప్పించుకోడానికి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా సియాల్‌కోట్ నగరం దాదాపు ఖాళీ అవుతోంది. ఏడున్నర లక్షల జనాభా కలిగిన ఈ నగరాన్ని ప్రజలు వదిలివెళ్తుండటం ఆ పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

భారత ఆర్మీ రెడీ: అత్యున్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయాలు

పాకిస్తాన్ దాడులకు భారత జవాబు ఇచ్చిన వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధానిలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ భేటీలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న తాజా పరిణామాలను సమీక్షించడంతో పాటు, దేశ భద్రతపై మరింత నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

India Pakistan War

ఆర్మీ చీఫ్‌కు విస్తృతాధికారాలు: టెరిటోరియల్ ఆర్మీ వినియోగానికి గ్రీన్ సిగ్నల్

ఈ సుదీర్ఘ సమీక్షల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948లోని 33వ నిబంధన ఆధారంగా ఆర్మీ చీఫ్‌కు విస్తృతాధికారాలు అప్పగించింది. దీంతో టెరిటోరియల్ ఆర్మీలోని జవాన్లు, అధికారుల సేవలను అవసరమైతే రెగ్యులర్ ఆర్మీకి సహాయకులుగా వినియోగించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 32 టెరిటోరియల్ ఇన్ఫ్రాంట్రీ బటాలియన్‌లు, 14 ఆర్మీ బటాలియన్‌లను వివిధ కమాండ్‌లకు మోహరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సదరన్, ఈస్టర్న్, వెస్టర్న్, సెంట్రల్, నార్తరన్, సౌత్-వెస్టర్న్ కమాండ్‌లు, అలాగే అండమాన్-నికోబార్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌ల్లో వీటిని వినియోగించనున్నారు.

సెలెబ్రిటీ సైనికుల సేవలు కూడా ఉపయోగించవచ్చు

టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదాల్లో ఉన్న ప్రముఖులు కూడా కేంద్రం దృష్టిలోకి తీసుకొచ్చారు. మాజీ క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ధోనీ, మలయాళ నటుడు మోహన్‌లాల్ వంటి వారు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ పదవుల్లో ఉన్నారు. అత్యవసర సమయాల్లో వీరి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read also: Pakistan : సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తోంది..!: పాకిస్థాన్‌ ఎంపీ

#AttackOnIslamabad #EmptySialkot #IndianArmyReply #IndianSoldiersJaiHind #InterceptMissiles #MohanlalArmy #PakistanDefiance #RajnathSingh #TerritorialArmy #ViolenceOnArmy Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Operation Sindoor Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.