📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: India: మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం

Author Icon By Tejaswini Y
Updated: November 13, 2025 • 6:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనతో (India)భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, “ఆపరేషన్ సింధూర్” ఘటనలతో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో “ఆపరేషన్ సింధూర్ 2.0” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: Health: రేబిస్ వ్యాధి లక్షణాలు ..తెసుకోవాల్సిన జాగ్రత్తలు

తాజా కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విచారణను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉండగానే ఈ ఘటనపై స్పందించారు. దేశ భద్రతకు ముప్పుగా నిలిచే శక్తులపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్,(India) అఫ్గానిస్తాన్‌లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సూసైడ్ బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా, ఆ దాడికి పాక్ తాలిబాన్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఆ దాడికి భారత్ మద్దతుగా ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. గతంలో “ఆపరేషన్ సింధూర్” సమయంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఈసారి పాకిస్థాన్‌కు అమెరికా మద్దతు దొరకదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సమస్యల్లో చిక్కుకుపోయినందున దక్షిణాసియా ఉద్రిక్తతలపై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Delhi Blast 2025 India Pakistan tension Operation Sindhoor 2.0 Telugu News online Terror Attack Delhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.