📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు

Author Icon By Sudha
Updated: October 14, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో అగ్ర ఆర్థికశక్తిగా ఎదగాలనే మనదేశ లక్ష్యం లో ఇప్పుడు ఒక కీలకమైన అడుగు పడింది. అదే విదేశీ ద్రవ్యపరిష్కార విధానం (ఫారిన్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్- FCSS). దీనిని గుజరాత్లోని గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ప్రారం భించడం ఈ లక్ష్యసాధనలో భాగం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 7, 2025 నాడు ఎఫ్సీఎస్ఎస్ను(FCSS) ప్రారంభించారు. ఇది కేవలం సాంప్రదాయ పద్దతి స్థానంలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య కరెన్సీ మార్చుకునే పద్ధతిలో మనదేశం తెచ్చిన ఒక వ్యవస్థాగత మార్పు. ఈ విధాన ముఖ్యలక్ష్యం విదేశీ లావాదేవీల్లోని అనవసరమైన ఆలస్యాన్ని, అధిక ఖర్చును, ఆ ప్రక్రియలో ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడమే. ఎఫ్ఎసీఎస్ఎస్ (FCSS))విజయవంతమైతే మన గిఫ్ట్ సిటీ అంతర్జాతీయంగా పేరుగాంచిన లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అగ్ర ఆర్థిక కేంద్రాలకు సమానంగా ఎదగగలుగుతుంది. ముఖ్యంగా మన దేశీయ బ్యాంకులు ఇకపై విదేశీ కరెన్సీ చెల్లింపుల కోసం ఇతర దేశాల కరస్పాండెంట్ బ్యాంకుల సేవలకు, వాటి పని వేళలకు ఎక్కువగా ఎదురుచూడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. ఎఫ్ఎసీఎస్ఎస్ ఆవశ్యకతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, దాని రాకముందు విదేశీ లావాదేవీలు ఎలా జరిగేవో పరిశీలించాలి. సాంప్రదాయ పద్ధతిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం.

FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు

తక్షణమే పరిష్కారం

గిఫ్ట్ సిటీలోని ఒక బ్యాంకు (దీనిని ఇంటర్నేషనల్ బ్యాం కింగ్ యూనిట్ ఐబియుఅంటారు) అమెరికన్ డాలర్లలో ఒక లావాదేవీ చేస్తే, ఆ డబ్బు నేరుగా చేరేది కాదు. ఆ లావాదేవీ పూర్తి కావడానికి డబ్బు అమెరికా, యూరప్ లోని కరస్పాండెంట్ బ్యాంకులు సహా అనేక మధ్యవర్తి బ్యాంకులు సంక్లిష్టమైన గొలుసు గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 36 నుండి 48 గంటల సుదీర్ఘ సమయం పట్టేది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలం అనేక తీవ్రమైన సమస్యలకు దారితీసేది. ఏదైనా ఒక బ్యాంకు దివాలా తీసినా లేదాడబ్బు చెల్లించడంలో విఫలమైనా మొత్తం లావాదేవీ ఆగిపోయే ప్రమాదం ఉండేది. రెండోది నిధులు వృథా అవడం. బ్యాంకులు ఎప్పుడూ విదేశీ ఖాతాలలో పెద్దమొత్తంలో డబ్బును నిల్వ చేసి ఉంచాలి. సిద్ధంగా ఉంచిన ఈ డబ్బు, తమ దేశీయ అవసరాలకోలేదా ఇతర పెట్టుబడులకో ఉపయోగపడేదికాదు. మూడవ సమస్య ఖర్చు పెరగడం. ప్రతి మధ్యవర్తి బ్యాంకు తమ సేవలకు తప్పకుండా ఫీజులు వసూలు చేయడంతో, చివరకు లావాదేవీ చేసే వారికి అయ్యే ఖర్చు బాగా పెరిగిపోయేది. ఎఫ్సీ ఎస్ఎస్ ఈ సమస్యలన్నింటికీ మూడు కీలకమైన పరిష్కా రాలను చూపించింది. ఎఫ్సీఎస్ఎస్ ద్వారా విదేశీ కరెన్సీ లావాదేవీలు ‘రియల్ టైమ్’లో అంటే తక్షణమే పరిష్కారం అవుతాయి. దీన్ని సాకారం చేయడానికి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంట ర్స్ అథారిటీ- ఐఎఫ్ఎస్సి ఎ) ఒక ప్రత్యేకమైన ‘స్థానిక సెటి ల్మెంట్ బ్యాంకు’ని ఏర్పాటు చేసింది. గిఫ్ట్ సిటీలోని అన్ని బ్యాంకులు ఈ స్థానిక బ్యాంకులో విదేశీ కరెన్సీకి సంబం ధించిన ఖాతాలను తెరుస్తాయి. దీనివల్ల ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు డాలర్లు పంపాల్సి వస్తే, ఆ డబ్బు అంత ర్జాతీయ మార్గాల గుండా ప్రయాణించకుండా, కేవలం ఈ స్థానిక ఖాతాల మధ్యే క్షణాల్లో మార్పిడి జరుగుతుంది. దీని వల్ల బ్యాంకులు తమ నిధులు ఎప్పుడు, ఎంత అందుబాటు లో ఉంటాయో అనే దానిపై ఖచ్చితమైన అంచనా వేయగ లుగుతాయి.

FCSS: ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త అడుగు

పెద్ద భద్రత

ప్రస్తుతం అమెరికన్ డాలర్స్ మాత్రమే ఈ పద్ధతిలో మార్పిడి చేస్తున్నారు. త్వరలోనే ఇతర ప్రముఖ అంతర్జాతీయ కరెన్సీలను కూడా ఈ విధానంలో చేరుస్తారు. అలాగే ఈ నూతన పద్ధతిలో సెటిల్మెంట్ ప్రమాదం పూర్తి గా తొలగిపోతుంది. ఎందుకంటే డబ్బు పంపడం, స్వీకరిం చడం అనే లావాదేవీలోని రెండు భాగాలు ఒకేచోట ఒకే సమయంలో పూర్తి అవుతాయి. దీనివల్ల మధ్యలో ఆగిపోయే అవకాశమే ఉండదు.అంతేకాకుండా, బ్యాంకులు తమ లావా దేవీల కోసం విదేశీ బ్యాంకుల్లో పెద్దమొత్తంలో నిధులు వృథాగా నిల్వచేయాల్సిన అవసరం ఉండదు. విముక్తి పొందిన ఈ నిధులు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో పెట్టుబడిగా మారడానికి అవకాశం కల్పిస్తాయి. ఇది బ్యాంకు ల వద్ద డబ్బు అందుబాటును అంటే ద్రవ్య లభ్యతను బలో పేతం చేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలప్రాధికార సంస్థ పర్యవేక్షణలో, భారతదేశంలోని చెల్లింపుల పరి ష్కార వ్యవస్థల చట్టం 2007కింద పనిచేస్తుంది. ఈ చట్ట బద్ధమైన, కట్టుదిట్టమైన వ్యవస్థ విదేశీ సంస్థలకు ఒక పెద్ద భద్రత ఇస్తుంది. ఇది చట్టపరమైన స్పష్టతను, ప్రమాద నివా రణను, పూర్తి పారదర్శకతను అందిస్తుంది. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు, పెద్ద అంతర్జాతీయ బ్యాంకులుఎటువంటి సందేహం లేకుండా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, గిఫ్ట్ సిటీలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి మరింత ఎక్కువగా ముందుకు వస్తారు. భారతదేశం తీసుకున్న చారి త్రాత్మక, వ్యూహాత్మక అడుగు. వేగవంతమైన, తక్కువఖర్చు తో కూడిన, నమ్మక మైన లావాదేవీల పరిష్కార వేదికగా గిఫ్ట్ సిటీని చూసిఅంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు తమగ్లోబల్ హబ్ ఎంచుకుంటారు. దీని ద్వారా మన దేశం ప్రపంచ నిధులు కేంద్రంగా మారుతుంది. అలాగే అంతర్జాతీయవాణిజ్య లావాదేవీలలో ఆలస్యం, ఖర్చులు తగ్గడం వలన భారతీయ వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీ పడగలుగుతా యి. ఇది దేశీయ ఎగుమతులు, దిగుమతులను పెంచిమొత్తం మీద దేశ ఆర్థికవృద్ధికి బాగా సహాయపడుతుంది. ఎఫ్ఎసీఎస్ఎస్ అనేది కేవలం టెక్నాలజీ వ్యవస్థ మాత్రమే కాదు. ఇది ప్రపంచ ఆర్థికరంగాన్ని నడి పించే దేశాల సరసన మన దేశం మరింత స్థిరంగా, విశ్వా సంతో నిలబడగలుగుతుందని చాటే ఒక గట్టి ప్రకటన.

-డి.జె. మోహన్ రావు

విదేశీ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ (FCSS) అంటే ఏమిటి?

FCSS అనేది విదేశీ కరెన్సీ లావాదేవీల పరిష్కారానికి (సెటిల్మెంట్) ఉపయోగించే ఒక చెల్లింపు వ్యవస్థ.
దీనిని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (IFSCA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) యొక్క అనుబంధ సంస్థ అయిన CCIL IFSC లిమిటెడ్ ఈ వ్యవస్థను నిర్వహిస్తుంది.

FCSS వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

వేగవంతమైన సెటిల్మెంట్: గతంలో 36 నుంచి 48 గంటలు పట్టే సెటిల్మెంట్ ప్రక్రియను ఈ వ్యవస్థ రియల్-టైమ్ (అప్పటికప్పుడు) లేదా దాదాపు రియల్-టైమ్‌లో పూర్తి చేస్తుంది. ప్రభావవంతమైన నిర్వహణ: ఇది అంతర్జాతీయ వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది, అలాగే లిక్విడిటీ నిర్వహణను మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయ గుర్తింపు: ఈ వ్యవస్థ వల్ల గిఫ్ట్ సిటీ, అంతర్జాతీయంగా హాంకాంగ్, టోక్యో వంటి ఆర్థిక కేంద్రాల సరసన నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Economic Development financial growth Global Economy India economy India global role latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.