📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India Navy Base: భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని ప్రచారం పై నిజమెంత?

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India Navy Base: పశ్చిమాసియాలో యుద్ధంలో ఇరాన్‌పై దాడులకు భారత్ నౌకదళ స్థావరాలను అమెరికా ఉపయోగించుకుంటోందని ఆరోపించిన నివేదికలను న్యూఢిల్లీ తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రేరర్ అమెరికా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్‌పై యుద్ధానికి భారత నౌకాదళ స్థావరాలను అమెరికా వినియోగించకుందని ఆరోపించారు. బుధవారం శ్రీలంకలోని గాలె వద్ద హిందూ మహా సముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరెస్ డెన్‌ను జలాంతర్గామితో అమెరికా దాడిచేసి ముంచేసింది. ఈ ఘటనలో 150 మంది గల్లంతుకాగా.. మరో 32 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌ పోర్టు నుంచే దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

Read Also: Middle East Conflict: యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌ నుంచి శంషాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు

India Navy Base: How true is the propaganda that America is using Indian bases?

భారత్ కౌంటర్

మా స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ మౌలిక సౌకర్యాలు నాశమయ్యాయి. వాస్తవానికి భారత్, భారత నౌకాశ్రయాలపై మేము ఆధారపడాల్సి వస్తోంది. ఇది అంత మంచిది కాదని మా నేవీ అంటోంది అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి అని కౌంటర్ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న భారత్ పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇరు వర్గాలూ సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India rejects US Navy base claims Latest News in Telugu MEA India statement Telugu News West Asia War

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.