ఇండియా మారిటైమ్ వీక్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) షిప్పింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మారిటైమ్ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో ప్రధానమని, సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది దోహదపడుతోందని తెలిపారు. విలింజం పోర్ట్ నిర్మాణం ద్వారా భారత్ కొత్త దిశగా అడుగులు వేసిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో 85 దేశాలు పాల్గొన్నాయని, రూ.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని ప్రధాని తెలిపారు.
Read Also: Faridabad Crime:మైనర్ బాలిక కిడ్నాప్..ఆ పై సామూహిక అత్యాచారం
India: ఆర్థిక అభివృద్ధిలో మారీటైమ్ రంగం
మోదీ మాట్లాడుతూ గత 11 ఏళ్లలో భారత మారిటైమ్ రంగం గణనీయమైన పురోగతి సాధించిందని, ప్రపంచస్థాయిలో కొత్త రికార్డులు నెలకొల్పిందని పేర్కొన్నారు. విలింజం పోర్ట్ ద్వారా దేశంలో తొలి డీప్ వాటర్ పోర్ట్ ఏర్పడిందని, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ అక్కడికి చేరిందని అన్నారు. పాత చట్టాలు, నిబంధనలను రద్దు చేసి కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టామని, భారత పోర్ట్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లామని వెల్లడించారు. సముద్ర వాణిజ్యం గతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని, తీరప్రాంత అభివృద్ధి ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని మోదీ పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: