ఆమె వెళ్లింది దేవుడిని దర్శించుకునేందుకు. అందుకోసం దేశం కానీ దేశానికి వెళ్లింది. తన మత విశ్వాసాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు, మరో మతంలోని వ్యక్తిని పెళ్లాండేందుకు ఆ మతాన్నే స్వీకరించిన ఉదంతం ఇది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్తాన్కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన ఈ మహిళ చర్యతో భారత భద్రతా, విదేశాంగ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
పంజాబ్ లోని(Punjab) కపుర్తలాకు చెందిన సర్వజిత్ కౌర్ (52) అనే ఓ మహిళ గురునానక్ దేవ్ 555వ జయంతి సందర్భంగా నవంబరు 4న 1,992 మంది యాత్రికులతో కూడిన బృందంలో ఆమె వాఘా-అట్టారీ సరిహద్దు గుండా పాకిస్తాన్ లోకి ప్రవేశించింది. పదిరోజుల పాటు చారిత్రక గురుద్వారాలను సందర్శించిన యాత్రికుల బృందం నవంబరు 13న భారత్ కు (India) తిరిగి వచ్చింది. అయితే, ఈ బృందంలో సర్వజిత్ కౌర్ లేరు. భారత్ లోకి ప్రవేశించిన ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో ఆమె పేరు లేకపోవడంతో ఆమె పాక్ లోనే మిస్ అయింది.
Read Also: Vijayanagaram:కాకి తీసిన దీపంతో అగ్నిప్రమాదం:నాలుగు ఇళ్లు బూడిద
ఇండియాకు పంపే ఏర్పాటు: పాక్ మంత్రి
సర్వజిత్ కౌర్ అదృశ్యమైన కొద్ది రోజులకే ఉర్దూ భాషలో ఉన్న ఒక నిఖా నామా (ఇస్లామిక్ వివాహ ఒప్పంద పత్రం) వెలుగులోకి వచ్చింది. ఆ పత్రం ప్రకారం, ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. మత మార్పిడి తర్వాత ఆమె తన పేరును నూర్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. షేక్ పూరాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని నూర్ సర్వజిత్ కౌర్ వివాహం చేసుకున్నట్లు ఆ పత్రంలో ఉంది. సర్వజిత్ కౌర్ కు గతంలోనే విడాకులయ్యాయి. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు గత 30 ఏళ్లుగా మాజీ భర్త కర్నైల్ సింగ్ తో కలిసి ఇంగ్లండ్ లో నివసిస్తున్నారు. పాకిస్తాన్ మంత్రి అరోరా ఈ విషయంపై స్పందిస్తూ, సర్వజిత్ కౌర్ ను అరెస్టు చేసి, ఆమెను తిరిగి భారత్ కు పంపేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: