📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

India : 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

Author Icon By Divya Vani M
Updated: May 7, 2025 • 8:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది.ఆ సమాధానమే ‘ఆపరేషన్ సింధూర్‘. ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ దళాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో 9 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు లక్ష్యంగా మారారు.అందులో సుమారు 80 మంది ముష్కరులు మృతిచెందినట్లు సమాచారం.బహవల్పూర్‌లోని జైషే అధినేత మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమయ్యారు.ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది.రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా స్కాల్ప్ మరియు హామర్ క్షిపణులను ప్రయోగించారు.స్కాల్ప్ క్షిపణిని ‘స్టార్మ్ షాడో’ అని కూడా పిలుస్తారు.

India 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా పనిచేసే స్టెల్త్ టెక్నాలజీ కలిగినది. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తుంది.దీనిలో INS, GPS, భూమి సంకేతాల ఆధారంగా నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది. లక్ష్యానికి చేరుకున్నప్పుడు, దీని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ తేలికగా టార్గెట్‌ను గుర్తిస్తుంది. ఇది గోడల లోపలికీ చొచ్చుకుపోయే శక్తి కలిగిన క్షిపణి.ఆపరేషన్‌లో మరో కీలక హథియార్ హామర్ బాంబ్. ఇది ఫ్రాన్స్ కంపెనీ ‘సఫ్రాన్’ తయారుచేసింది. గ్లైడ్ బాంబ్‌గా పేరుగాంచిన ఈ ఆయుధం 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు.హామర్ 250, 500 లేదా 1000 కిలోల వార్ హెడ్‌తో వస్తుంది. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. దాన్ని అడ్డుకోవడం శత్రువులకు చాల కష్టం.గట్టిపడిన భవనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం దీని ప్రత్యేకత. భారత్ ఈ బాంబుతో జైషే మరియు లష్కరే స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.ఈ దాడులతో భారత్ తీవ్రమైన హెచ్చరిక పంపింది. ఉగ్రవాదం ఎక్కడ నుంచి వచ్చినా, దానికి గట్టి సమాధానం ఇస్తామని తెలిపింది.

Read Also : మోదీని భారత్ ను అంతం చేస్తాం: మసూద్ అజహర్ చూస్తాం చేస్తాం

Indian Air Force Strike Indian Airstrike 2025 Jaish-e-Mohammed Camps Lashkar-e-Taiba Targets Operation Sindhoor Pahalgam Terror Attack Pakistan Terror Camps

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.