📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India-China: చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

Author Icon By Vanipushpa
Updated: March 13, 2026 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంపిక చేసిన రంగాల్లో చైనా పెట్టుబడులపై ఆంక్షలు సడలింపునకు మంగళవారం భారత్ పచ్చజెండా ఊపింది. ఇరు దేశాల మధ్య ఆరేళ్ల ఉద్రిక్తతల తర్వాత మూలధన కొరత తగ్గింపు, ఆర్థిక సంబంధాల పున:ప్రారంభమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, మధ్య ప్రాచ్యంలో యుద్ధం వల్ల పెరిగిన అనిశ్చితి, పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని అంతర్జాతీయ, ఆర్థిక సంబంధాల నిపుణులు చెబుతున్నారు. బహుశా అందుకే ఆరేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న భారత్, చైనా సంబంధాలు మళ్లీ క్రియాశీలకంగా మారాయంటున్నారు. దేశంలో చైనా కంపెనీల పెట్టుబడి నిబంధనలను 2020లో భారత్ కఠినతరం చేసింది.

Read Also: US vs Iran: అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

India-China: India gives green signal to Chinese investments

లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద 2020 జూన్‌లో భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం చైనా పెట్టుబడిదారులు భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, దేశ హోమ్, విదేశాంగ మంత్రిత్వ అధికారులతో కూడిన ప్యానల్ నుంచి భద్రతా అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఈ ఆంక్షల వల్ల అనేక ఒప్పందాలు నిలిచిపోయాయని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. వాటిలో 2023లో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల జాయింట్ వెంచర్‌లో బీవైడీ కంపెనీ పెట్టాలనుకున్న 1 బిలియన్ డాలర్ల (రూ.9,240 కోట్లు) పెట్టుబడి కూడా ఉంది.

నిబంధనల సడలింపుతో ఎలక్ట్రానిక్స్, సోలార్, సెల్ రంగాలలో అనుమతులు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల్లో మార్పులను కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఈ నిబంధనలు అంతకుముందు చైనాతో భూసరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కఠినతరం చేశాయి. ఇప్పుడు నిబంధనల సడలింపుతో ఎలక్ట్రానిక్స్, సోలార్, సెల్ రంగాలలో అనుమతులు ఇవ్వనున్నారు. వ్యూహాత్మక తయారీ రంగంలో పెట్టుబడులకు కాల పరిమితిని 60 రోజులుగా నిర్ణయించారు. ఈ రంగాల్లో చైనా పెట్టుబడులను 60 రోజుల్లోగా ప్రాసెస్ చేస్తామని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అమెరికా సుంకాల యుద్ధంతో గత ఏడాది కాలంగా భారత్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అమెరికా సుంకాలను తగ్గించినప్పటికీ, అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే, భారత్‌కు బలమైన ఆర్థిక భాగస్వామి కావాల్సి ఉంది. ”భారత్‌లో మూలధన పెట్టుబడిపై ఆసక్తి ఉంది. చైనాలో అత్యధిక సామర్థ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహిస్తే, ఇది రెండు దేశాలకు ప్రయోజనకరం” అని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెప్పారని ఆంగ్ల వార్తాపత్రిక ది హిందూ తెలిపింది. అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టడం కంటే భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రిటర్నులను చైనా పొందవచ్చని అధికారులు చెప్పారు. ‘

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

border tensions impact Chinese investments in India Electronics Manufacturing FDI policy update India China Relations Indian government green signal PLI scheme China solar industry investments Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.