📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Big Shock : పాక్ కు భారత్ మరో షాక్!

Author Icon By Sudheer
Updated: April 29, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై మరోసారి కఠినమైన వైఖరి తీసుకున్నది. ఇప్పటికే పాక్‌పై పలు ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ఈ మేరకు కేంద్రం సంబంధిత శాఖలతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇది అమలవుతే పాక్‌కు విమాన రవాణా రంగంలో పెద్ద దెబ్బ తగలనుంది.

చైనా లేదా శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి

భారత గగనతలాన్ని వినియోగించకుండా ఆంక్షలు విధిస్తే, పాక్ విమానయాన సంస్థలు మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. దీని వల్ల వాటి ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా లేదా శ్రీలంక గగనతలాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా పాక్‌కు భారంగా మారుతుంది. ఇంతకు ముందు 2019లో బాలాకోట్ దాడి అనంతరం కూడా ఇలాంటి ఆంక్షలు విధించడంతో పాక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Read Also : Istanbul Shop Controversy: ఇస్తాంబుల్ దుకాణంలో వివాదాస్పద బోర్డు..డిస్కౌంట్ అడగొద్దు

సముద్ర రవాణాలోనూ పాక్‌పై ఆంక్షలు విధించే దిశగా భారత్

ఇక, విమాన రవాణా మాత్రమే కాదు, సముద్ర రవాణాలోనూ పాక్‌పై ఆంక్షలు విధించే దిశగా భారత్ ఆలోచిస్తోంది. పాక్‌కు చెందిన షిప్పింగ్ సర్వీసులను భారత పోర్టుల్లో ప్రవేశించనీయకుండా నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇది అమలైతే పాక్‌కు వాణిజ్య రవాణాలో మరో పెద్ద దెబ్బ తగలనుంది. ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశాలకు భారత్ సున్నితంగా లేదని ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది.

another shock Google News in Telugu india Pakistan!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.