Vaccine india : గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

Read Time:  1 min
Vaccine india
Vaccine india
FONT SIZE
GET APP

Vaccine india : దేశంలో మహిళల ఆరోగ్య రక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు యుక్త వయసు బాలికలకు Human Papillomavirus Vaccine (HPV) టీకాను దేశవ్యాప్తంగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కీలక చర్యగా భావిస్తున్నారు.

Read Also: HPV Vaccine: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ లక్ష్యాలు

కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, 14 ఏళ్లు దాటిన బాలికలకు (Vaccine india) ఈ టీకాను ఉచితంగా అందిస్తారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 2.6 కోట్ల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం కోసం గ్లోబల్ వ్యాక్సిన్ కూటమి గావి నుంచి పెద్ద మొత్తంలో డోసులు సమకూర్చనున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న Gardasil టీకా గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్ రకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒక డోసు ధర సుమారు ₹3,900 వరకు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పథకం ద్వారా ఇది ఉచితంగా అందించబడుతుంది.

వయస్సు ఆధారంగా డోసులు

  • 15 ఏళ్ల లోపు బాలికలు – 2 డోసులు
  • 15 ఏళ్లు పైబడిన వారు – 3 డోసులు

బాలికల భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ టీకా ఇప్పించాలని ఆరోగ్య శాఖ సూచించింది. గర్భాశయ క్యాన్సర్ రహిత భారత్ లక్ష్యానికి ఇది కీలక ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.