📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

India : గత ఐదేళ్లలో 119 వైద్య విద్యార్థులు ఆత్మహత్య

Author Icon By Digital
Updated: May 3, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్టు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (UDF) సమాచారం హక్కు చట్టం (RTI) ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వెలుగులోకి తెచ్చింది. ఈ ఆత్మహత్యలలో 64 మంది ఎంబీబీఎస్ (అండర్ గ్రాడ్యుయేట్) విద్యార్థులు కాగా, మిగతా 55 మంది పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) మెడికల్ విద్యార్థులు. ఇదే సమయంలో 1,116 మంది వైద్య విద్యార్థులు తమ చదువును మధ్యలోనే వదిలేశారని పేర్కొంది. వీరిలో 160 మంది అండర్ గ్రాడ్యుయేట్లు కాగా, 956 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు.ఇది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విషయం కాదు. 2018 నుంచి 2022 మధ్య కాలంలో కూడా 64 మంది ఎంబీబీఎస్, 58 మంది పీజీ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు గత ఆర్టీఐ డేటా ద్వారా వెల్లడైంది. 2020 నుంచి 2022 మధ్య కాలంలో 531 మెడికల్ కాలేజీల్లో 68 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ నివేదిక తెలిపింది.

India : గత ఐదేళ్లలో 119 వైద్య విద్యార్థులు ఆత్మహత్య

India : ఇండియాలో గత ఐదేళ్లలో 119 వైద్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు

ఈ ఆత్మహత్యలకు కారణాలు కూడా స్పష్టంగా బయటపడ్డాయి. విద్యలో ఒత్తిడి, పరీక్షల భారం, తగినంత విశ్రాంతి లేకపోవడం, ప్రతికూల పని వాతావరణం, ఎక్కువ అంచనాలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులను కాపాడేందుకు పని గంటలు తగ్గించడం, కౌన్సెలింగ్ సేవలు అందించడం, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమని సీనియర్ వైద్యులు సూచిస్తున్నారు.ఇక మరోవైపు మెడికల్ విద్యార్థులు కాలేజీల నిర్వహణపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎంబీబీఎస్ మరియు పీజీ విద్యార్థుల నుంచి సుమారు 1,680 ఫిర్యాదులు అందినట్టు ఆర్టీఐ సమాచారం తెలిపింది. వీటిలో ర్యాగింగ్, వేధింపులు వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలలో విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

Read More : Indian Cook : కువైట్‌లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు

Breaking News in Telugu Counseling for Students Medical Education medical students mental health Paper Telugu News Student Issues Student Suicides Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.