భారత్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో (India’s seafood exports) ప్రపంచంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారికంగా ప్రకటించింది. 2014-15లో సముద్ర ఉత్పత్తుల విలువ $5.4 బిలియన్లుగా ఉండగా, 2024-25లో ఇది $7.2 బిలియన్లకు పెరిగిందని వివరించింది. ఇది భారత్ ఆక్వా రంగంలో సాధించిన ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఆక్వా సాగు పద్ధతులు
ఈ విజయానికి ఆధునిక ఆక్వా సాగు (Aquaculture) పద్ధతులు, గాలి-నీటి నాణ్యత పరిరక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నిల్వ పద్ధతులు ప్రధాన కారణాలుగా పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ సముద్ర ఉత్పత్తుల ఉత్పత్తి 16.85 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని వెల్లడించారు.
భారత ఉత్పత్తులకు డిమాండ్
ఈ పురోగతితో భారత ఆక్వా రంగానికి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన గుర్తింపు లభించిందని, మరిన్ని విదేశీ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నదని వాణిజ్య శాఖ పేర్కొంది. రైతులకు లాభదాయకత పెరిగేలా కేంద్రం మరిన్ని సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టే దిశగా యోచిస్తోందని అధికారులు తెలిపారు.
Read Also : Indira Soura Giri Jala Vikasam: నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్