భారత్–జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం
India and Japan : భారత ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్‌సెన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. (India and Japan) ఇద్దరు నేతలు సెండాయ్ నగరానికి చేరుకోగా, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.
జపాన్ గవర్నర్లతో ముఖ్య సమావేశం
ప్రధాని మోదీ టోక్యోలో 16 మంది జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో సమావేశమయ్యారు. భారత్–జపాన్ స్నేహంలో రాష్ట్రాలు–ప్రిఫెక్చర్ల భాగస్వామ్యం ఒక కీలక స్తంభం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర–ప్రిఫెక్చర్ భాగస్వామ్య కార్యక్రమంను కూడా ప్రారంభించారు.
వాణిజ్యం, స్టార్టప్‌లు, టెక్నాలజీలో భాగస్వామ్యం
ఈ భాగస్వామ్యం ద్వారా భారత రాష్ట్రాలు మరియు జపాన్ ప్రిఫెక్చర్లు నేరుగా కలిసి పనిచేసే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, స్టార్టప్‌లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు (SMEs) రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ రంగాల్లో సహకారం ఇరు దేశాలకు మేలుకలిగిస్తుందని అన్నారు.
డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ 2.0
ఈ పర్యటనలో భారత్–జపాన్ మధ్య AI, డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ 2.0 వంటి కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇవి టెక్నాలజీ, వ్యాపారం, స్టార్టప్ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
Read also :