📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India : భారత్ రక్షణ ఎగుమతుల్లో 34 రెట్ల వృద్ధి

Author Icon By Divya Vani M
Updated: May 14, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రక్షణ రంగం ఇప్పుడు అసలు ఊపులో ఉంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో దేశం ముందుకు దూసుకెళ్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.23,622 కోట్లను తాకాయి. ఇది దాదాపు $2.76 బిలియన్లకు సమానం. భారత రక్షణ రంగ చరిత్రoలో ఇదొక చారిత్రక ఘట్టం.గత ఏడాది రూ.21,083 కోట్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి 12.04% పెరిగాయి. మరి 2013-14లో ఏమాత్రం ఉందో తెలుసా? కేవలం రూ.686 కోట్లు! అంటే ఈ పదేళ్లలో 34 రెట్లు వృద్ధి సాధించాం. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ విజయాన్ని స్పష్టంగా చాటుతోంది.India ప్రస్తుతం భారత్ రక్షణ ఉత్పత్తులు సుమారు 80 దేశాలకు పంపుతోంది. ఇది ఒక్కదేశం కష్టపడి సాధించగలిగే విజయం కాదు. దీనికి ప్రభుత్వ మద్దతు, ప్రైవేట్ రంగ పట్టుదల, మరియు టెక్నాలజీ అభివృద్ధి ప్రధాన కారణాలు. 2029 నాటికి ఈ ఎగుమతులు రూ.50,000 కోట్ల వరకు పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ గట్టిగా నిర్ణయించింది.

India భారత్ రక్షణ ఎగుమతుల్లో 34 రెట్ల వృద్ధి

‘ఆపరేషన్ సిందూర్’ – భారత ఆయుధాల నాణ్యతకు సాక్ష్యం

ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. భారత ఆయుధ వ్యవస్థలు ఎంత ఆధునికంగా తయారవుతున్నాయో ఈ ఆపరేషన్ స్పష్టంగా తెలియజేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భారత్‌కి మరింత గ్లోబల్ మార్కెట్‌లో పేరు తెచ్చిపెడుతుంది.ఈ ఏడాది ఎగుమతుల్లో ప్రైవేట్ రంగం ముందంజలో ఉంది. వారు రూ.15,233 కోట్ల విలువైన ఉత్పత్తులను ప్రపంచానికి అందించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) కూడా వెనుకపడలేదు – రూ.8,389 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేశాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, DPSUల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 42.85% పెరిగాయి.

నూతన విధానాలు, ప్రోత్సాహకాలు – విజయానికి చుక్కెదురు

భారత ప్రభుత్వం అనేక సదుపాయాలను తీసుకువచ్చింది. వీటిలో ఆన్‌లైన్ అనుమతి ప్రక్రియలు, విధాన సవరణలు, స్వదేశీ తయారీకి మద్దతు వంటి చర్యలు ఉన్నాయి. ఇవి దేశీయ తయారీదారులకు కొత్త అవకాశం కల్పిస్తున్నాయి.ఇప్పుడు భారత్ తక్కువ దిగుమతులు చేసుకుంటోంది. India కానీ ఎగుమతుల్లో మాత్రం దూసుకెళ్తోంది. మందుగుండు సామగ్రి, ఆయుధాలు, విడిభాగాలు, యుద్ధ సామగ్రి వంటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచానికి వెళ్లిపోతున్నాయి.ఈ వేగవంతమైన ప్రగతి చూస్తే మన దేశం త్వరలోనే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో కీలక భూమిక పోషించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also : Yogi Adityanath : భారత్ భద్రతకు భంగం కల్గిస్తే అంత్యక్రియలకు కూడా పనికిరారు :యోగి ఆదిత్యనాథ్

Atmanirbhar Bharat India defense exports Indian arms exports 2025 Indian defense industry growth Indian private defense sector Make in India defense

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.