ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో మళ్ళీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కానీ మ్యాచ్ ముగిసిన కొద్ది గంటలకే ఆయన తండ్రి మణి సుందర్ (Mani Sundar) చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు ప్రతిభను నిర్లక్ష్యం చేస్తూ టీమిండియా సెలెక్షన్ కమిటీ నిరంతరం పక్కన పెట్టుతోందనే ఆరోపణలు ఆయన గుప్పించారు.
మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి రోజు భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. ప్రధాన బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వరుసగా ఔటైన తర్వాత జట్టుకు పరాజయం తప్పదన్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తో భాగస్వామ్యం కట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లు వేగం, స్వింగ్, స్పిన్ అన్నింటితో దాడి చేస్తున్నా సుందర్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రక్షణాత్మకంగా ఆడుతూ జట్టును కాపాడాడు.మొత్తం 206 బంతులు ఎదుర్కొన్న సుందర్ 101 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడి సహనం, క్రమశిక్షణ, అద్భుతమైన టెక్నిక్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించేలా జట్టును కాపాడి ఒక రక్షకుడిలా నిలిచాడు. ఇది కేవలం వ్యక్తిగతంగా కాకుండా జట్టుకి కూడా అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌గా నిలిచింది.
జాతీయ జట్టులో నిర్లక్ష్యం
మణి సుందర్ మాట్లాడుతూ, “ప్రతీసారి వాషింగ్టన్ అద్భుత ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. కానీ అతని ప్రతిభను సరైన రీతిలో గుర్తించడం లేదు. ఇతర ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లలో ఫెయిల్ అయినా నిరంతరం అవకాశాలు అందుతుంటాయి. నా కొడుకు మాత్రం ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే వెంటనే జట్టులో నుంచి తొలగిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం?” అని ప్రశ్నించారు.2021లో చెన్నై, అహ్మదాబాద్ టెస్ట్ (Ahmedabad Test) లలో ఇంగ్లండ్‌పై స్పిన్ పిచ్‌లపై 85, 96 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీలు సాధించకపోయినా ఆ ఇన్నింగ్స్‌లు జట్టును నిలబెట్టాయి. అయినా తరువాతి మ్యాచ్‌లకు చోటు దక్కలేదు. మరే ఇతర ఆటగాడికి ఇలా జరిగి ఉండేది?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం వాషింగ్టన్‌ను మానసికంగా మరింత బలపరిచిందని, ఇప్పుడు అందుకు ఫలితంగా అతను గొప్ప ఇన్నింగ్స్ ఆడగలడని పేర్కొన్నారు.
ఐపీఎల్‌లోనూ అన్యాయం
జాతీయ జట్టులోనే కాదు, ఐపీఎల్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మణి సుందర్ ఆరోపించారు. “గుజరాత్ టైటాన్స్ జట్టులో కూడా వాషింగ్టన్‌కి నిరంతర అవకాశాలు రావడం లేదు. 2025 ఐపీఎల్ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో కేవలం 6 మ్యాచ్‌ల్లోనే అతడిని ఆడించారు. ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్‌లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి తన విలువ చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్‌కు ఇచ్చిన మద్దతు లాంటి సపోర్ట్ నా కొడుకుకు దేశవాళీ క్రికెట్‌లో కూడా అందలేదు” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
క్రికెట్ వర్గాల్లో సంచలనం
వాషింగ్టన్ సుందర్ తండ్రి చేసిన ఈ ఆరోపణలు భారత క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ సుందర్ సాధించిన అద్భుతమైన సెంచరీ, ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. భారత జట్టు ఎంపిక కమిటీ ఇకనైనా వాషింగ్టన్ సుందర్ సామర్థ్యాన్ని గుర్తించి, అతనికి తగిన అవకాశాలను కల్పిస్తుందా అనేది చూడాలి.
ఐపీఎల్ ఉద్యోగుల జీతం ఎంత?
Ipl లోని ఉద్యోగులు సగటున ₹37.6 లక్షలు సంపాదిస్తారు, 6 ప్రొఫైల్స్ ఆధారంగా సంవత్సరానికి ₹19.2 లక్షల నుండి ₹123.7 లక్షల వరకు సంపాదిస్తారు.
వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఎప్పుడు ప్రారంభం అయ్యింది?
మొదట బ్యాట్స్‌మన్‌గా ఆడిన ఆయన తర్వాత ఆఫ్-స్పిన్ బౌలర్‌గా తన ప్రతిభను నిరూపించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్ ద్వారా గుర్తింపు పొందాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: BCCI : బీసీసీఐ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డ్ భారీ దొంగతనం