దేశవ్యాప్తంగా రేషన్ కార్డు (RATION CARD)ల దుర్వినియోగంపై కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PM-GKAY) కింద ఉచిత రేషన్ పొందుతున్న వారిలో అనర్హుల తొలగింపు ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆహార శాఖకు తాజాగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం, ఆదాయపు పన్ను చెల్లించే వారిని రేషన్ జాబితా నుంచి తొలగించనున్నారు (Income tax payers will be removed from the ration list).ఈ మార్గదర్శకాల ప్రభావం పాత, కొత్త అన్ని రేషన్ కార్డులపై ఉంటుంది. ఇప్పటికే రుణాల కోసం పన్ను చెల్లిస్తున్న మధ్య తరగతి కుటుంబాలు కూడా ఈ జాబితాలో ఉండటంతో అనేక మంది ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పన్ను చెల్లించడమే అనర్హతకు కారణమవుతుందనే వార్త విస్తృతంగా చర్చనీయాంశమైంది.లబ్ధిదారుల ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు ఆధార్ మరియు పాన్ వివరాలు కేంద్రానికి అవసరమవుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (DFPD) వాటిని ఆదాయపు పన్ను శాఖకు అందిస్తుంది. అనంతరం, పన్ను చెల్లింపు వివరాలను పరిశీలించి కేంద్రం నిబంధనల ప్రకారం అర్హతను నిర్ణయిస్తుంది.
పన్ను చెల్లించినందుకే రేషన్ కార్డు పోతుందా?
ఇక్కడే అసలు సమస్య. మధ్య తరగతి వర్గానికి ఎక్కువశాతం వ్యక్తులు రుణాల కోసం ఆదాయ పన్ను ఫైలింగ్ చేస్తున్నారు. అనేక కుటుంబాలు ఇంటి రుణం, వాహన రుణం, విద్యా రుణం కోసం పన్ను చెల్లించాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు అదే విషయం వారికి నష్టంగా మారుతోంది.ఈ మార్గదర్శకాల అమలుతో వేల సంఖ్యలో తెల్ల రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. ఇవి రద్దయితే వారికి ఉచిత బియ్యం మాత్రమే కాదు, ఆరోగ్యశ్రీ, విద్య, గృహ పథకాలు కూడా దూరమవుతాయి. దీంతో మధ్య తరగతి వారిలో తీవ్ర అసంతృప్తి వెల్లివిరుస్తోంది.
రేషన్ కార్డు vs ఆదాయ పన్ను – మధ్య తరగతి లోపల అర్థరాత్రి కల
“పన్ను చెల్లించాను అంటే సంపన్నుడినని ఎలా అంటారు?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. “రుణం కోసం పన్ను చూపించాం, కానీ వాస్తవంగా పరిస్థితి దారుణంగా ఉంది” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనితో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రేషన్ కార్డు తొలగింపు కంటే ముందుగా వారికి వాస్తవిక స్థితిని అంచనా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం పన్ను చెల్లించారని మాత్రమే నమ్మకూడదని, జీవన పరిస్థితులు చూసే విధానాన్ని అనుసరించాలంటున్నారు.ఈ మార్గదర్శకాల ప్రకారం, ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు ఉచిత పథకాలకు అర్హత కోల్పోతాయి. ఇది సాధారణ మధ్య తరగతి కుటుంబాలపై భారీ ప్రభావం చూపనుంది. రేషన్‌తో పాటు సంబంధిత అన్ని సంక్షేమ పథకాలకు వీరు దూరమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
Read Also : Defense Deal : మీ ఫైటర్ జెట్లు మాకొద్దు.. భారత్ స్పష్టం