భారత బలగాలు ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై జరిపిన ‘Operation Sindhuర్’ తర్వాత హిందూ మహాసముద్రంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనాకు చెందిన ‘డ యాంగ్ యి హావో’ అనే నిఘా నౌక భారత్ సముద్ర జలాల సమీపంలో కనిపించింది. ఈ పరిణామం భారత రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.ఆపరేషన్ సిందూర్ అనంతరం ఈ నౌక ఇక్కడ సంచరించడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సాధారణ పర్యవేక్షణ కాదన్నది నిపుణుల అభిప్రాయం. భారత్ నౌకాదళ కదలికలు, జలాంతర్గాముల రూట్లు, నిఘా వ్యవస్థలను గమనించేందుకే ఈ నౌక పంపబడినట్లు అనుమానిస్తున్నారు.ఈ నౌకలో ఉన్న అధునాతన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు సముద్ర గర్భంలోని సమాచారం సేకరించగలవు. INS విక్రాంత్ వంటి యుద్ధ నౌకల చలనం కూడా వీటి ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది.
భారత్ సిద్ధంగా ఉందా?
ఆపరేషన్ అనంతరం భారత్ కూడా నౌకాదళాన్ని హై అలర్ట్ లో ఉంచింది. INS విక్రాంత్‌తో పాటు, బ్రహ్మోస్ క్షిపణులున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు అరేబియా సముద్రం వైపు మోహరించబడ్డాయి. భారత రక్షణ వ్యవస్థ అలర్ట్‌గా పనిచేస్తోంది.
పాక్-చైనా చీకటి వ్యవహారమా?
ఈ నౌక చైనా నిఘా పథకాలలో భాగంగా పాక్‌కు మద్దతుగా పనిచేస్తుందని విశ్లేషకులు అనుకుంటున్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో సమాచారం పాక్ చేతుల్లోకి వెళ్లాలన్నదే ఈ దురుద్దేశమని భావిస్తున్నారు.అంతేకాదు, చైనా కోసం కీలకమైన CPEC ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సాగుతోంది. దాన్ని నిలకడగా కొనసాగించాలంటే, పాక్‌లో స్థిరత అవసరం. అందుకే చైనా నిఘా చర్యలు పెంచినట్లు నిపుణుల అభిప్రాయం.
నిఘాకేనా? లేక మరేదైనా ఉందా?
ఈ నౌక కేవలం నిఘా కోసం మాత్రమే కాదు. భారత కమ్యూనికేషన్ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసే సామర్థ్యం కూడా ఉండొచ్చని అంటున్నారు. సముద్రంలో సబ్‌మెరైన్ కదలికల మ్యాపింగ్ చేయగలదు. ఈ సమాచారాన్ని భవిష్యత్‌లో పాక్‌లో మిలిటరీ స్థావరాల కోసం వాడే అవకాశముంది.
ఇదే తొలిసారి కాదు
2024లో ‘యువాన్ వాంగ్ 6’ అనే మరో నిఘా నౌక కూడా ఈ ప్రాంతంలో మోహరించడంతో అప్పుడూ ఇలాంటి ఆందోళనలు వెల్లువెత్తినవి. చైనా ఇలా భారత ప్రభావాన్ని ఈ ప్రాంతంలో తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.చైనా నౌకల కదలికలు చూస్తుంటే, ఇది కేవలం సాధారణ నౌకాయానంగా కనిపించదు. భారత జలాల్లో చైనా నిఘా పెరగడం ఆందోళన కలిగించే విషయం. భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
Read Also : Earthquake :భారీ భూకంపంతో వణికిపోయిన చైనా