📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Urea Price Hike: యుద్ధం ప్రభావం..పెరిగిన ఎరువుల ధరలు!

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Urea Price Hike: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతన్నల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా, పొలాల్లో పండాల్సిన పంటలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమెరికాలోని సౌత్ డకోటా నుంచి ఆస్ట్రేలియా పొలాల వరకు ఇదే ఆందోళన కనిపిస్తోంది.

Read Also: Earthquake: రాజస్థాన్‌లో భూకంపం

గ్యాస్ సంక్షోభం: ఎరువుల ఉత్పత్తికి బ్రేక్!

ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూరియా, అమోనియం, ఇతర NPK ఎరువుల తయారీలో గ్యాస్ ప్రధాన ముడి పదార్థం. ఉత్పత్తి కేంద్రాలు మూతపడటం లేదా ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో ఎరువుల కొరత ఏర్పడింది. ఇది నేరుగా సరఫరా గొలుసును దెబ్బతీసి ధరలను పెంచుతోంది.కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే టన్ను యూరియా ధర 470 డాలర్ల నుంచి ఏకంగా 550 డాలర్ల మార్కును దాటేసింది.

Impact of war..increased fertilizer prices!

సాధారణంగా ఒక రైతు సాగు ఖర్చులో ఎరువుల వాటా 50 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల నేరుగా రైతుల ఆర్థిక వెన్నుముకను విరుస్తోంది.ఎరువుల కొరత ఏర్పడితే అది నేరుగా దిగుబడులపై పడుతుంది. దిగుబడులు తగ్గితే మార్కెట్‌లో ధాన్యం, బియ్యం వంటి ఆహార పదార్థాల లభ్యత తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతుంది. “పొలంలో పంట పండి మన పళ్లెంలోకి రావడానికి 6 నుండి 9 నెలల సమయం పట్టవచ్చు కానీ, వచ్చే క్రిస్మస్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందని” నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fertilizer Crisis Israel Iran Conflict Impact on Farming Natural Gas Supply Disruption Urea Price Hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.