📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Ilayaraja – ఇళయరాజాకు భారతరత్న ఇవ్వాలని సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తన సినీ ప్రస్థానంలో అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఘనమైన సన్మాన వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM Stalin) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇళయరాజా సంగీత కృషికి గౌరవ సూచకంగా ఆయనను జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఇళయరాజా భారతీయ సంగీతానికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలి అని అధికారికంగా ప్రతిపాదన చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, హీరో కార్తి తదితరులు పాల్గొన్నారు. సినీ, సాహిత్య, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా హాజరై వేడుకను మరింత ప్రాభవవంతంగా మార్చారు.సీఎం స్టాలిన్ మాట్లాడుతూ – “ఇళయరాజా సంగీతం (Music by Ilayaraja) అమ్మ జోల పాటలా మనసును తాకుతుంది. బాధలను ఓదార్చుతుంది, ప్రేమను కీర్తిస్తుంది, విజయాన్ని ప్రోత్సహిస్తుంది. ఆయన లేని సంగీతం తమిళనాటను ఊహించుకోవడం అసాధ్యం” అని కొనియాడారు. ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం “ఇళయరాజా పురస్కారం” పేరుతో ఒక ప్రత్యేక బహుమతిని తమిళనాడు ప్రభుత్వం అందజేస్తుందని కూడా స్టాలిన్ ప్రకటించారు.

Ilayaraja

ఈ అరుదైన గౌరవంపై ఇళయరాజా స్పందిస్తూ

ఇళయరాజాకు ‘ఇసైజ్ఞాని’ అనే బిరుదును 1988లో కరుణానిధి (Karunanidhi) అందించారని గుర్తు చేసుకున్నారు.ఈ అరుదైన గౌరవంపై ఇళయరాజా స్పందిస్తూ.. సంగీత ప్రపంచంలో ఏ కంపోజర్‌కూ ఇంత గొప్ప సన్మానం ఇంత వరకు జరగలేదని అన్నారు. రికార్డు చేసిన పాటల కంటే లైవ్ సంగీతం గొప్పగా ఉంటుందని, అందుకే పెద్ద స్టేడియంలో ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈవిషయంలో సీఎం స్టాలిన్ సహాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇళయరాజాను తాను ఎప్పుడూ ‘స్వామి’ అని పిలుస్తానని చెప్పారు. ఆయన 70, 80వ దశకాల్లో చేసిన పాటలు ఇప్పటికీ సినిమాల్లో పెట్టినా సూపర్ హిట్ అవుతాయని, ‘రాగ దేవి’ తన సంగీతాన్ని ‘రాగ దేవునికి’ అర్పించిందని రజనీకాంత్ ప్రశంసించారు.ఇక చివరగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ ఇళయరాజాకు ‘పీఆర్‌ఓ’నే అని సరదాగా చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అభిమానిగా పాటల జాబితాను సిద్ధం చేశారని.. ఆ పాటలనే వేదికపై ఆలపించారని తెలిపారు. ఇళయరాజా, కమల్ హాసన్‌లు కలిసి ఒక పాటకు తమ గళాలను కూడా వినిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tamilnadu-protein-powder-that-took-the-life-of-a-young-man-what-really-happened/national/547112/

50 years in cinema Bharat Ratna proposal Breaking News CM MK Stalin felicitation ceremony Ilaiyaraaja latest news music director Tamil Nadu government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.