📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

fluoride removal system : ఫ్లోరైడ్ తొలగింపు వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి

Author Icon By Sudha
Updated: June 19, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT Guwahati) పరిశోధకులు మరో ఘనత సాధించారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్‌ (Fluoride, iron)తొలగించే నీటి శుద్ధి (Water purification) వ్యవస్థను అభివృద్ధి చేశారు.

fluoride removal system : ఫ్లోరైడ్ తొలగింపు వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి

భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్‌ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. (fluoride removal system) సమర్థవంతమైన ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 20,000 లీటర్ల వరకు కలుషిత నీటిని శుద్ధి చేయవచ్చు. సురక్షితమైన తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఐఐటీ గౌహతిలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్‌, పరిశోధకుడు ముఖేష్ భారతి, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ అన్వేషన్, డాక్టర్ పియల్ మండల్, ప్రొఫెసర్ మిహిర్ కుమార్ పుర్కైట్ కలిసి దీనిపై పరిశోధన చేశారు. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్, ఐరన్‌ తొలగించే నీటి శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రతిష్టాత్మక ఏసీఎస్‌ ఈఎస్‌ అండ్‌ టీ వాటర్ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి ప్రచురించారు.
కేవలం రూ.20 ఖర్చు
కాగా, ఈ నీటి శుద్ధి వ్యవస్థను వాస్తవ పరిస్థితుల్లో 12 వారాల పాటు పరీక్షించినట్లు ఐఐటి గౌహతి కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మిహిర్ కే పుర్కైట్ తెలిపారు. కలుషిత జలాల నుంచి 94 శాతం ఇనుము, 89 శాతం ఫ్లోరైడ్‌ను తొలగించిన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా 1000 లీటర్ల నీటి శుద్ధికి కేవలం రూ.20 ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఎలక్ట్రోడ్‌ మార్చాల్సి ఉంటుందని, తద్వారా ఈ వ్యవస్థ 15 సంవత్సరాలు పని చేస్తుందని వివరించారు.
సోలార్‌ లేదా విండ్‌ పవర్‌
మరోవైపు అస్సాంలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం మద్దతుతో చాంగ్సరిలోని కాకతి ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ నీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మిహిర్ కే పుర్కైట్ తెలిపారు. సోలార్‌ లేదా విండ్‌ పవర్‌ ద్వారా యూనిట్‌ను ఆపరేట్ చేసే విధానం, ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ గ్యాస్ వినియోగంపై మరింతగా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ సెన్సార్లు, ఆటోమేటెడ్ నియంత్రణలు వంటి స్మార్ట్ టెక్నాలజీల ద్వారా తక్కువ సిబ్బందితో తాగునీటి వసతి లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వీటి ఏర్పాటు, మిగతా వాటర్‌ ప్లాంట్స్‌తో అనుసంధానంపై కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫ్లోరైడ్‌, ఐరన్‌తో పాటు ఆర్సెనిక్ వంటి ఇతర కలుషణాలను కూడా క్లోరిన్ లేదా waste నీటిలేకుండా తొలగించగల సామర్థ్యం కలిగి ఉంది.

Read Also:Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు నిజమే

#CleanWater #Electrocoagulation #FluorideRemoval #IITGuwahati #IronRemoval #WaterPurification Breaking News in Telugu develops fluoride Google news Google News in Telugu IIT Guwahati Latest News in Telugu Paper Telugu News removal system Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.