📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IIT Bombay Rules: చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్

Author Icon By Pooja
Updated: October 7, 2026 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IIT Bombay Rules: మహారాష్ట్రలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే పరీక్షల్లో చీటింగ్, అన్యాయ పద్ధతుల వినియోగానికి సంబంధించిన కేసులను పరిష్కరించే విధానంలో మార్పులు తీసుకురావడానికి డ్రాఫ్ట్ నిబంధనలు సిద్ధం చేసింది. విద్యార్థి సహిల్ వాకోడే మృతి నేపథ్యంలో పరీక్షలు, క్రమశిక్షణ చర్యలపై క్యాంపస్‌లో చర్చ జరుగుతున్న వేళ ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

Read also:TG degree admissions: కొత్త కోర్సులతో డిగ్రీ అడ్మిషన్ల జోరు

విద్యార్థిపై వెంటనే చర్యలు ఉండవు

కొత్తగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. పరీక్షల్లో అన్యాయ పద్ధతులు ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోరు. ముందుగా విద్యార్థి వివరణను పూర్తిగా విననున్నారు. ఆ తర్వాతే చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పరీక్ష సమయంలో అన్యాయ పద్ధతుల వినియోగం గుర్తించిన వెంటనే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త డ్రాఫ్ట్‌లో మాత్రం విద్యార్థి తన వాదనను వినిపించేందుకు మరింత స్పష్టమైన అవకాశం కల్పించే విధానాన్ని ప్రతిపాదించారు.

సహిల్ వాకోడే మృతి తర్వాత చర్చ

22 ఏళ్ల విద్యార్థి సహిల్ వాకోడే గత నెలలో IIT బాంబే క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో మృతిచెందాడు. మిడ్‌-సెమిస్టర్ పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్, ChatGPT ఉపయోగించినట్లు గుర్తించిన అనంతరం అతడిని పరీక్ష హాల్ నుంచి బయటకు పంపినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన అతడి మృతి క్యాంపస్‌లో తీవ్ర నిరసనలకు దారితీసింది. పరీక్షల ఇన్విజిలేటర్ సూర్యనారాయణ దూల్లా.. విద్యార్థి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండటం, ఉపయోగించడాన్ని గుర్తించిన తర్వాత సంస్థ నిబంధనల ప్రకారమే వ్యవహరించారని IIT బాంబే ఫ్యాకల్టీ ఫోరం పేర్కొంది.

CCTVలో ఏం కనిపించింది?

పరీక్ష హాల్‌కు సంబంధించిన CCTV దృశ్యాల్లో వాకోడే ముందు వరుసలో కూర్చున్నట్లు కనిపించింది. ఇన్విజిలేటర్ అతడి వద్దకు వెళ్లి మాట్లాడిన తర్వాత విద్యార్థి తన మొబైల్ ఫోన్‌ను అప్పగించినట్లు దృశ్యాల్లో ఉన్నట్లు సమాచారం. ఇన్విజిలేటర్‌తో కొంతసేపు మాట్లాడిన అనంతరం వాకోడే తన వస్తువులను సర్దుకుని పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లినట్లు CCTV ఫుటేజ్‌లో కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

కుటుంబం, ఆందోళనకారుల ఆరోపణలు

అయితే వాకోడే కుటుంబ సభ్యులు, నిరసనకారులు మాత్రం అతడిపై సంస్థాగత వేధింపులు, క్యాంపస్‌లో కుల వివక్షకు గురయ్యాడని ఆరోపించారు. ఈ కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు పేర్కొన్నారు. మరోవైపు, ప్రాథమిక దర్యాప్తులో సంబంధిత ప్రొఫెసర్‌కు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లభించలేదని దర్యాప్తు వర్గాలు తెలిపినట్లు సమాచారం. అయితే వాకోడే కుటుంబం చేసిన ఇతర ఆరోపణలపై ఇంకా పూర్తిస్థాయి నిర్ధారణ జరగలేదు. అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.

IIT Bombay Rules: విద్యార్థులకు మరింత అవకాశం కల్పించేలా..

వాకోడే మృతి తర్వాత పరీక్షల్లో క్రమశిక్షణ చర్యల విధానంపై తలెత్తిన ప్రశ్నల నేపథ్యంలో IIT బాంబే రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి వివరణను ముందుగా పరిగణనలోకి తీసుకుని, ఆ తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ChatGPT Exam Education News Exam Cheating IIT Bombay IIT Bombay Rules IIT News latest news Latest Telugu News Mumbai News Sahil Wakode Student suicide Unfair Means Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.