📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

IFR2026: అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ నౌకాదళ మహోత్సవాలు

Author Icon By Pooja
Updated: February 16, 2026 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR-2026) విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖ రెండోసారి వేదిక కావడం విశేషం. 2016 తర్వాత మరోసారి 2026లోనూ విశాఖను ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను నేవీ మరోసారి నిరూపించింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 25 వరకు పది రోజుల పాటు కొనసాగనున్నాయి.

Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి

ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు పాల్గొంటుండగా, 70కి పైగా అత్యాధునిక యుద్ధనౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ పది రోజుల పాటు నేవీ సిబ్బంది సందడి, యుద్ధనౌకల అలంకరణలతో విశాఖ నగరం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

ఈసారి ఉత్సవాలు IFRకే పరిమితం కాకుండా మూడు ప్రధాన కార్యక్రమాల సమ్మేళనంగా నిర్వహిస్తున్నారు. IFRతో(IFR2026) పాటు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మిలాన్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్‌సైజెస్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (IONS) సమావేశాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి. దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు, మిత్రదేశాలతో సముద్ర భద్రత, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

నిన్న సాయంత్రం ‘మిలాన్’ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించి ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటు చేయగా, విదేశీ అతిథులకు ఇది ‘మినీ ఇండియా’గా కనిపిస్తోంది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న ఆర్‌కే బీచ్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించనుండగా, దీనికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సముద్రంలో జరిగే యుద్ధ విన్యాసాలు ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

గతంలో అండమాన్‌లో పరిమితంగా నిర్వహించిన ‘మిలాన్’ విన్యాసాలను ఈసారి మెరుగైన మౌలిక వసతుల కారణంగా విశాఖకు మార్చడం పర్యాటక రంగానికి కొత్త ఊతం ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపించడమే కాకుండా, వివిధ దేశాల యుద్ధనౌకలు, జలాంతర్గాములను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం ప్రజలకు లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IndianNavy InternationalFleetReview Latest News in Telugu VisakhapatnamEvents

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.